ప్రధాని మోడీపై వాట్సఫ్ లో పెట్టిన పోస్టుతో ఉద్యోగానికే ఎసరు

November 30, 2016

పెద్దనోట్ల రద్దు తర్వాత సోషల్ మీడియాలో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు దేశ ప్రధానిని అవమానిస్తూ అనేక రకాల పోస్టులు పెడుతూ వస్తున్నారు. కొందరైతే పూర్తి విచక్షణ కోల్పోయి ప్రధానిపై అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ , ఆ వ్యాఖ్యలకు ఫ్రెండ్స్ నుండి వచ్చిన కామెంట్లకు మరింత రెచ్చిపోయి అసందర్భ వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా పూర్తిగా అదుపుతప్పి ప్రవర్తిస్తున్నారు. అలాంటి వ్యాఖ్యలే చేసి , ఉద్యోగానికే ఎసరు తెచ్చుకున్న ఈ సంఘటనను ఒక్కసారి చదవండి.

moddi

వాట్సాప్‌ గ్రూప్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై పెట్టిన అభ్యంతరకర ఫోటోలు.. ఓ పంచాయతీరాజ్ అధికారి ఉద్యోగానికి ఎసరుపెట్టాయి. ఆయనతో పాటు మరో కాలేజీ ప్రిన్సిపాల్‌పైనా కేసు నమోదయింది.

సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డీఎం) సారథ్యంలో నడుస్తున్న ఓ వాట్సాప్‌ గ్రూప్‌లో పంచాయతీరాజ్ శాఖ అధికారి హిఫాజత్ ఉల్లాఖాన్ అభ్యంతరకరంగా ఉన్న మోదీ ఫోటోలను పోస్టు చేశారు.

ఉత్తర ప్రదేశ్‌లోని బిహండి పంచాయతీలో పనిచేస్తున్న ఆయనకు సదరు పోస్టులపై అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఖాన్ చెప్పిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో ఆయన్ను విధుల నుంచి సస్పెండ్ చేసినట్టు ఓ అధికారి వెల్లడించారు.

కాగా మోదీ అభ్యంతరకర ఫోటోలను వాట్సాప్‌లో సర్క్యులేట్ చేస్తున్న ఓ కాలేజి మేనేజర్ హరిఓం సింగ్‌పై… జిల్లాకి చెందిన బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు ఫరీద్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...