వాట్సాఫ్ లోని ఈ కొత్త ఫీచర్లు గురించి అందరికీ తెలియజేయండి

February 16, 2017

వాట్సాఫ్ లో కొత్త ఫీచర్లు వచ్చేసాయ్. తాజాగా భారీ మార్పులు తీసుకొచ్చి మరింత ఆసక్తికరంగా మార్చాలని సంస్థ డిసైడ్‌ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యాప్‌ ఓపెన్‌ చేసిన వెంటనే కాల్స్‌, చాట్‌, కాంటాక్ట్స్‌ అనే మూడు ట్యాబ్‌లు కనిపిస్తాయి. దీన్ని కెమెరా సింబల్‌తో ఒక ట్యాబ్‌, చాట్‌, స్ట్టేటస్‌ అనే మరో కొత్త ట్యాబ్‌, కాల్స్‌ అనేవి ఉండబోతున్నాయి.

అవేమిటంటే …….

స్ట్టేటస్‌ అనేది ఇప్పటి వరకు టెక్ట్స్‌ మాత్రమే పెట్టుకునేందుకు అవకాశం ఉంది. కొత్త అప్‌ డేట్‌లో 45 సెకన్ల నిడివి కలిగిన వీడియో కాని, ఫొటో కాని పెట్టుకోవచ్చు. దీనికింద వేరే వాళ్లు కామెంట్స్‌ కూడా పెట్టొచ్చు. వారు పెట్టే కామెంట్స్‌ కేవలం వేరేవాళ్లు చదవరు.. మొత్తం ఎంత మంది చూశారు అనేది కూడా సంఖ్య చెబుతుంది. 24 గంటలు గడిస్తే ఆటో మేటిగ్గా స్నాప్‌చాట్‌ తరహా డిలీట్‌ అయిపోతుంది.

పెట్టిన స్ట్టేటస్‌ ఎవరికి కనిపించొచ్చు అనేది కూడా మనమే నిర్ణయించుకోవచ్చు. కేవలం కాంటాక్ట్స్‌ జాబితాకే కనిపించేలా పెట్టొచ్చు.. లేదా ప్రత్యేకంగా కొందరిని ఎంపిక చేసుకుని వారికే కనిపించేలా పెట్టొచ్చు. దాంతో తెలియని వారు చూస్తారనే బెంగ కూడా ఉండదు.

వేరొకరు కొత్త స్టేటస్‌ పెడితే ట్యాబ్‌ పక్కన బ్లాక్‌ డాట్‌తో ఇండికేషన్‌ ఇస్తుంది. ఎవరి నంబరైనా మ్యూట్‌లో పెడితే వారి స్టేటస్‌ జాబితాలో కింద ఉంటాయి. సైలెంట్‌లో పెడితే మాత్రం యథావిధిగా కనిపిస్తాయి. స్టేటస్‌లు ఎన్ని వెళ్లాయి, ఎన్ని వచ్చాయి అనేది జాబితా రూపంలో కనిపిస్తాయి. ప్రస్తుతం పరీక్ష దశలో ఈ మార్పులున్నట్లు వాట్సప్‌ బీటా ఇన్ఫో తెలియజేసింది. బీటా వర్షన్‌లో సాధారణ అప్‌డేట్‌ ఎప్పటికి విడుదలవుతుంది అనే వివరాలు వెల్లడించలేదు. ఒక వేళ పూర్తిస్థాయిలో అప్‌డేట్‌ వస్తే మరో సంచలనమే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...