అత్యంత చవకగా కేవలం 50 రూపాయలతో బరువు తగ్గే మార్గం

November 28, 2016

మీ శరీర బరువును తగ్గించుకోవాలనుకుంటున్నారా……? అయితే…….. ఖరీదైన ఆహార పదార్థాలను తినాల్సిన అవసరం లేదు……. శరీరాన్ని ఎక్కువగా శ్రమ పెట్టాల్సిన అవసరం లేదు. అత్యంత చవకగా కేవలం 50 రూపాయాలలో లభించే, బరువు తగ్గించే ఆహార పదార్థాల ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.

బరువు తగ్గించుకోటానికి ఖరీదైన జిమ్ లు, పద్దతులను పాటించటం వ్యర్థం అని చెప్పవచ్చు. సహజ పద్దతులు మరియు తక్కువ ఖరీదు గల వాటి ద్వారా శరీర బరువు తగ్గించుకోవటం మంచి ఆలోచనగా చెప్పవచ్చు. అంతేకాకుండా, వీటి ద్వారా పోషకాలను కూడా పొందవచ్చు. తక్కువ ఖరీదులో బరువు తగ్గించే ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది.

gymdiet

అవిసె విత్తనాలు లేదా ఫ్లాక్స్ సీడ్స్ లో శరీర బరువును ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించే ఒమేగా-౩ ఫాటీ ఆసిడ్ మరియు ఫైబర్ లు ఉంటాయి. వీటిలో ఉండే కరిగే ఫైబర్ లు పొట్ట నిండినట్టుగా అనిపించేలా చేస్తాయి మరియు ఒమేగా-౩ఫాటీ ఆసిడ్ లు చక్కెరలపై ఉండే మక్కువను తగ్గిస్తాయి

గ్రీన్ టీ లో ఉండే పాలీఫినాల్స్, శరీరంలో నిల్వ ఉండేట్రై-గ్లిసరైడ్ లను కరిగిస్తాయి. అంతేకాకుండా, శరీరంలో సత్తువను పెంచి, బరువు తగ్గించుకోటానికి చేసే వ్యాయామాలను చేయటానికి తగిన శక్తిని సమకూరుస్తుంది.

గుడ్లు, కండరాల ద్రవ్యరాశిని పెంచటమే కాకుండా, కొన్ని ఇంచుల బరువు తగ్గించుకోటానికి సహాయపడుతుంది. రోజు ఉదయాన అల్పాహంగా గుడ్డును తీసుకునే వారిలో రెండు పౌండ్ల బరువు తగ్గుతుందని ‘బటాన్ రూజ్’లో “లూసియానా స్టేట్ యూనివర్శిటీ” వారు తెలిపారు.

పుచ్చపండు తియ్యగా, రుచికరంగా మాత్రమేకాకుండా, అధిక మొత్తంలో విటమిన్, మినరల్ లను కలిగి ఉంటుంది. పుచ్చపండు తినటం వలన కొద్ది సమయం పాటూ పొట్టనిండినట్టుగా అనిపించటమేకాకుండా, ఎక్కువ సమయం పాటూ ఆకలి అవకుండా చూస్తుంది.

దానిమ్మ పండ్లు అధిక మొత్తంలో శరీరానికి కావలసిన పోషకాలను మరియు యాంటీ ఆక్సిడెంట్ లను కలిగి ఉంటుంది. చక్కెరలు కలిగి ఉండే అనారోగ్యకర ద్రావణాలను తాగే బదులుగా, దానిమ్మ పండ్ల రసాన్ని తాగండి. దానిమ్మపండ్లలో సహజ చక్కెరలు మరియు కొన్ని క్యాలోరీలు ఉంటాయి

 

1 Comment

on అత్యంత చవకగా కేవలం 50 రూపాయలతో బరువు తగ్గే మార్గం.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...