ఉగ్రవాదులు మన దేశంలోకి ఎలా ప్రవేశిస్తున్నారో తెలిస్తే …. షాకవ్వాల్సిందే ….!

December 1, 2016

మన దేశం పై అనుక్షణం కన్నేసిన పాకిస్తాన్……. ఉగ్రవాదులను మన దేశంలోకి చొప్పించేందుకు అనేక కుటిల యత్నాలను సాగిస్తోంది. అందుకుగాను ఉగ్రవాదులు భారీ వ్యూహాల్నే పన్నుతున్నారు.దేశంలోకి ఎంటరవ్వడానికి రకరకాల మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు.

jsor

తాజాగా సాంబ సెక్టార్ లో బయటపడ్డ విషయం తెలిస్తే షాకవ్వాల్సిందే. ముష్కర మూకలు భారీ సొరంగ మార్గాన్నే ఏర్పరుచుకున్న విషయం బయటపడింది. సాంబ సెక్టార్‌లో జవాన్ల చేతిలో హతమైన ముగ్గురు ఉగ్రవాదులు భారత్ -పాక్‌ అంతర్జాతీయ సరిహద్దుల్లో సొరంగ మార్గం ద్వారానే ప్రవేశించినట్టు తేలింది.

వ్యవసాయ పొలాల కింద 2 మీటర్ల ఎత్తు.. 2 మీటర్ల వెడల్పుతో 80 మీటర్ల పొడవైన సొరంగాన్ని గుర్తించామని ఆయన తెలిపారు బీఎస్ఎఫ్ చీఫ్. పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించడం మినహా, సొరంగాలను గుర్తించే ఎలాంటి పరిజ్ఞానం ప్రస్తుతానికి బీఎ్‌సఎఫ్‌ వద్ద లేదని… ఇలాంటి వాటిపై సీరియస్ గా దృష్టిపెట్టామన్నారు

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...