స్వైపింగ్ మెషీన్ లావాదేవీలపై ట్యాక్స్ లు రద్దు

November 29, 2016

పెద్ద నోట్ల రద్దు కారణంగా చిల్లర సమస్యకు పరిష్కారంగా కార్డు వినియోగంపై అవగాహన పెంచుతోంది కేంద్రం. ఈ దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా.. …………. దేశవ్యాప్తంగా స్వైపింగ్ ( POS ) ద్వారా జరుపుతున్న లావాదేవీలకు ట్యాక్స్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ. లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా  ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

swiping-machine

వచ్చే ఏడాది  2017 మార్చి 31 వరకు ఎక్సైజ్, ఆక్ట్రాయ్ పన్నులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారాయన. త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామన్నారు జైట్లీ.

డెబిట్, క్రెడిట్ కార్డ్, ఆన్ లైన్ కొనుగోళ్లకు సర్ చార్జీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది ఆర్థిక శాఖ.

సెప్టెంబర్ 2012లో 7.41 లక్షల పాయింట్ ఆఫ్ సేల్ కొనుగోళ్లు జరిగాయన్నారు. సెప్టెంబర్ 2016 నాటికి  ఆ సంఖ్య 14.96 లక్షలుగా ఉందన్నారు. గత ఏడాదికి ఇది రెట్టింపుగా వెల్లడించారు.

ప్రజలలో చిల్లర కష్టాలు కొనసాగుతుండటంతో నగదు రహిత లావాదేవీలను ప్రొత్సహించాలని పిలుపునిచ్చింది కేంద్రప్రభుత్వం. రాష్ట్రాలు డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేయాలని మన్ కి బాత్ లో ప్రధాని నరేంద్రమోడీ కోరారు

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...