కొడుకులకు షాకిచ్చిన హైకోర్టు ……… తల్లిదండ్రులకు ఊరట

November 30, 2016

నవమాసాలూ మోసి , కని , పెంచిన తల్లిదండ్రులను అత్యంత దారుణంగా వీధులపాలు చేస్తున్న కొడుకులున్న ఈ కాలంలో ….. తల్లిదండ్రులకు అనుకూలంగా ఒక గొప్ప తీర్పు వచ్చింది.

అదేమిటంటే …. తల్లిదండ్రులు సంపాదించుకున్న ఇంటిపై కొడుకులకు ఎలాంటి హక్కు లేదని తీర్పిచ్చింది ఢిల్లీ హైకోర్టు. పేరెంట్స్ అనుమతిస్తేనే ఆ ఇంట్లో ఉండాలని ప్రకటించింది కోర్టు. పెళ్లికాని.. కాకాపోని కొడుకు ఎలాంటి లీగల్ రైట్ లేదంది. ఇంట్లో ఉన్నంత మాత్రాన తల్లిదండ్రులు సంపాదించుకున్న ఇంటిపై హక్కు ఉంటుందనుకోవడం చెల్లుబాటు కాదంది. జస్టిస్ ప్రతిభారాణితో కూడిన ధర్మాసనం ఈ తీర్పిచ్చింది.

delhi

వృద్ధులైన అమ్మనాన్నలతో కలిసి జీవిస్తున్న ఓ జంట.. పేరెంట్స్ కష్టార్జితం అయిన ఇంట్లో ఉంటూ.. వాటా ఇవ్వాలని 2007 లో కోర్టులో దావా వేశారు. అయితే ఆ ఇంటికి సంబంధించిన పత్రాలు పరిశీలించిన కోర్టు ఇంటిపై తల్లిదండ్రులకే పూర్తి హక్కు ఉందని..వాళ్ల అనుమతితోనే ఇంట్లో ఉండాలని చెప్పింది. అది వాళ్ల కష్టార్జితమని తెలిపింది ధర్మాసనం. కొడుకు, కోడల్ని తల్లిదండ్రుల ఇంటి నుంచి వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించింది.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...