ఆదివారం అసలు మాంసం ముట్టుకోకూడదా……. ? అసలు ఆరోగ్య రహస్యం ఏమిటంటే ….

January 9, 2017

మొదట నుంచి మన పూర్వీకుల ఆచారాలని, పెద్దలని కనుక మనం గమనించినట్లయితే ఆదివారానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. ఆదివారాన్ని సూర్యుని రోజుగా పరిగణిస్తారు, సూర్యుడు కనిపించే దేవుడు కూడా, ఈ సృష్టిలో సమస్త జీవ రాశులు ప్రత్యక్షంగా సూర్యుడి మీదే ఆధారపడి బతుకుతున్నాయి. శాస్త్రీయంగా ఆలోచించినా గ్రహాలన్నీ కూడా సూర్యుని చుట్టూనే తిరుగుతున్నాయి, దీనిని బట్టి ఖచ్చితంగా సూర్యుడు శక్తివంతమైన వాడు అని తెలిసిపోతుంది. అసలు మన పురాణాలలో మిగిలిన రోజుల్లో మాంసాహారం తీసుకున్నా తప్పులేదు కానీ, ఒక్క ఆదివారం మాత్రం ముట్టుకోకూడదు అని ఉంది.

chkn

మీరు నిశితంగా పరిశీలించినట్లయితే మామూలు రోజులలో కన్నా ఆదివారం మన తీరులో చాలా తేడా ఉంటుంది, మామూలు రోజులకన్నా ఎక్కువ ఉల్లాసంగా, శక్తి వంతంగా ఉంటాము, అది ముమ్మాటికీ సూర్య భగవానుడి మహిమే. కానీ ఆ రోజు కనుక మనం మాంసాహారం తీసుకుంటే ఆ శక్తిని మన శరీరంలోకి తీసుకునే సామర్ధ్యాన్ని కోల్పోతాము.

అసలు మొదట మన పూర్వీకులు ఆదివారం పూట మాంసం ముట్టరు, అసలు అది సెలవు రోజు కూడా కాదు.అయితే బ్రిటీష్ వారు మన దేశానికి వచ్చాక భారతీయుల మేధస్సుకి ఆశ్చర్యపోయారు, ఈ శక్తి మనం ఆదివారం పాటించే నియమాల వలన అని గమనించి, మన మేధస్సు అలానే ఉంటే ఎక్కువగా వాళ్ళ ఆటలు సాగవు కనుక, ఆదివారం సెలవు ప్రకటించారు. అలానే చిన్నగా ఆ రోజున మాంసం తినకూడదు అనే నియమాన్ని పూర్తిగా తొలగిపోయేటట్టు చేశారు.

కానీ ఆదివారంలో అద్భుత శక్తులు ఉన్నాయి, వాటిని కేవలం ఒక్కరోజు మాంసాహారం కోసం వృధా చేసుకోవటం ఎందుకు చెప్పండి, ఆదివారం మాంసం మానేసి కొన్ని వారాలపాటు మీరే గమనించండి మీలో అనూహ్యమైన మార్పులు చూస్తారు, జీవితంలో మీరు విజయం సాదించటానికి కావలసిన శక్తి ఆదివారం ఉంది .

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...