ఇప్పటినుండి పాస్ పోర్ట్ పొందటం ఇంకా చాలా ఈజీ

January 10, 2017

ఇంతకుముందు పాస్‌పోర్టు పొందాలంటే చాలా కష్టంతో కూడుకున్న పనిగా భావించేవారు. ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు జనన ధ్రువీకరణపత్రం ఉంటేనే పాస్‌పోర్టు మంజూరు చేసేవారు. జనన ధ్రువీకరణ పత్రం లేనివారు పాస్‌పోర్టు కోసం ఇబ్బందులు ఎదుర్కొనేవారు.

దళారులను ఆశ్రయించి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చు చేసేవారు. కొంతమంది ఆన్‌లైన్‌లో అవగాహన లేకుండా దరఖాస్తు చేసుకొని తిరస్కరణకు గురవుతున్నారు. ప్రస్తుతం పాస్‌పోర్టు జారీలో జనన ధ్రువీకరణపత్రం స్థానంలో ఆధార్‌కార్డుతోపాటు పలు ధ్రువపత్రాలు ఉంటే సరిపోతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే 14 రోజుల వ్యవధిలోనే పాస్‌పోర్టు అందుకునే వీలుంటుంది.

ps

ఏయే నిబంధనలను సడలించారంటే ……

1989 జనవరి 26వ తేదీ తరువాత జన్మించిన వారికి పుట్టినతేదీ పత్రం తప్పనిసరి కాదని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిబంధనలు గత నెల 26వ తేదీ నుంచి అమలులోకి వచ్చిందని ప్రకటించారు. పాస్‌పోర్టులు కోసం దరఖాస్తు చేసుకునే వారిలో ఎక్కువశాతం 1990 తరువాత పుట్టిన వారే ఉంటున్నారు. పుట్టిన తేదీ పత్రం బదులు పదో తరగతి మార్కుల జాబితా, టీసీ, పానకార్డు, ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్సు, ఓటరు కార్డులలో పుట్టిన తేదీ నమోదు చేసి ఉంటే సరిపోతుంది. దీంతోపాటు మరికొన్ని నోటరీలను కూడా రద్దు చేశారు.

 ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు, ఉద్యోగులు, ఆన్‌లైన్, మీ సేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకుంటున్నారు. పాస్‌పోర్టు ఇండియా జీవోవి.ఇన వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 15 ఏళ్ల లోపు పిల్లలకు రూ.1000, 15 నుంచి పైబడిన వయస్సు ఉన్న వారికి రూ.1,500 రుసుం ఉంటుంది. అత్యవసరాలకు పాస్‌పోర్టు పొందాలంటే తత్కాల్‌ విధానం కూడా అమలులో ఉంది.

 అర్హతలు ఏమిటంటే ……..

పుట్టిన చిన్నారి నుంచి వృద్ధుల వరకు పాస్‌పోర్టు పొందవచ్చు. దరఖాస్తు నివాస ధ్రువీకరణ పత్రాలు రెండు, పుట్టిన తేదీ పత్రం, విద్యార్హతకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు తీసుకెళ్లాలి. నివాస ధ్రువీకరణకు ఓటరు, ఆధార్‌, బ్యాంకు అకౌంటు, టెలిఫోన్, విద్యుత్తు బిల్లులు ఉపయోగపడుతాయి. తీసుకెళ్లేవి ఏవైనా సరే రెండు నకళ్లు ఉండాలి.

నివాస ధ్రువీకరణ పత్రాల్లో ఇంటి పేరు, పేరు, ఇంటి సంఖ్య, వీధి, గ్రామం, తపాలా, మండలం, జిల్లా పేర్లు ఒకే విధంగా ఉండాలి. పదో తరగతి లోపు చదువకుంటే టీసీ తప్పనిసరి. పదో తరగతి మార్కుల జాబితా కలిగి ఉండాలి. డిగ్రీ చదువుకున్న వారు సంబంధిత విద్యార్హత పత్రం తీసుకెళ్లాలి. చిన్నపిల్లలకు పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రంతోపాటు తల్లి, తండ్రి లేదా సంరక్షకుని పాస్‌పోర్టు, నివాస ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

2 Comments

on ఇప్పటినుండి పాస్ పోర్ట్ పొందటం ఇంకా చాలా ఈజీ.
  1. RAVI chandra
    |

    10th pass and. Diploma 1st year

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...