వాట్సాఫ్ లో కొత్త ఫీచర్లు ఇవే …………

January 13, 2017

వాట్సాఫ్ లో కొత్త ఫీచర్స్ వచ్చేసాయ్.అవును ….వాట్సాప్ త‌మ వినియోగ‌దారుల‌కు తీపు క‌బురు చెప్పింది. ఇప్ప‌టి వ‌ర‌కు వాట్సాప్ ద్వారా 10 ఫోటోల‌ను మాత్ర‌మే ఒకే సారి షేర్ చేసే అవ‌కాశం ఉండేది.

awatsap

ఇక‌పై 30 ఫోటోలు ఒకే సారి షేర్ చేసుకునేలా అవ‌కాశం క‌ల్పించింది. ఇప్ప‌టికే తీసిన వీడియోల‌ను జిఫ్ ఫార్మాట్‌లో షేర్ చేసే అవ‌కాశం తీసుకొచ్చిన వాట్సాప్‌… తాజాగా జిఫ్ సెర్చ్ ఫీచ‌ర్‌ను తీసుకొచ్చింది.

ఎమోజీ బ‌ట‌న్ నొక్కితే జిఫ్ కోసం ప్ర‌త్యేక ట్యాబ్ వ‌స్తుంది. దీంతో ఫీలింగ్‌కు త‌గ్గ‌ట్టుగా జిఫ్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్ర‌స్తుతం ఈ ఫీచ‌ర్లు ఆండ్రాయిడ్ 2.17.6 వ‌ర్ష‌న్‌లో మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయి

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...