భారతీయులందరూ గర్వపడేలా తీర్పునిచ్చిన సుప్రీం కోర్టు

November 30, 2016

జనగణమన అధినాయక జయహే అని వింటే చాలు ప్రతి భారతీయుడి గుండె దేశభక్తితో ఉప్పొంగుతుంది.అదీ మన జాతీయగీతానికున్న గొప్పదనం. అలాంటి జాతీయ గీతాన్ని గురించి గొప్ప తీర్పునిచ్చింది మన సుప్రీం కోర్టు.

supreme

అదేమిటంటే ………..

సినిమా థియేటర్లలో సినిమా ప్రారంభమయ్యే ముందు జాతీయ గీతం ఆలపించాలని సూచించింది. అదే సమయంలో తెరపై త్రివర్ణపతాకం ఎగురుతూ ఉండాలని తెలిపింది. ఎలాంటి నాటకీయత లేకుండా జాతీయగీతం ప్లే చేయాలని తెలిపింది కోర్టు.  జాతీయగీతాన్ని, జాతీయపతాకాన్ని పౌరులు గౌరవించాలని తెలిపింది ధర్మాసనం. జాతీయ గీతం సమయంలో  ప్రేక్షకులు అందరూ కచ్చితంగా నిలబడాలని సూచించింది. ప్రతి షో ముందు జాతీయ గీతం ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

భోపాల్ కు చెందిన నారాయణ చౌస్కీ అనే సామాజిక కార్యకర్త వేసిన పిటిషన్ ఆధారంగా  ఈ తీర్పు ఇచ్చింది న్యాయస్థానం. 1960లో ఈ విధానాన్ని అమలు చేసేవి సినిమా థియేటర్లు. 1990లో ఈ పద్ధతిని నిలిపివేశాయి. 2003లో మహారాష్ట్ర గవర్నమెంట్ మళ్లీ ఈ విధానాన్ని ఆ రాష్ట్రంలో తీసుకొచ్చింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆర్డర్స్ ఇచ్చింది

 

1 Comment

on భారతీయులందరూ గర్వపడేలా తీర్పునిచ్చిన సుప్రీం కోర్టు.
  1. vinod
    |

    Pm modyji taking. Correct. Decision

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...