భగవంతుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఇవి తప్పకుండా పాటించండి

January 11, 2017

భగవంతుడి ఆరాధనలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయ్ అయితే దానిలో ప్రధానమైనది నైవేద్యం సమర్పించడం అయితే ఇది చాలా ముఖ్యమైన మరియు దేవుని కృప పూర్తిగా దక్కే మార్గం ఇది అందుకే ఇక్కడ మనం తెలిసి లేదా తెలియక తప్పులు అస్సలు చెయ్యకూడదు.

naivedyam
నైవేద్యం విషయంలో అస్సలు చేయ్యకూడనీవి

  • నైవేద్యం ఎప్పుడు కూడా వెండి, బంగారం లేదా రాగి పాత్రల్లోనే పెట్టాలి. అలాగే నైవేద్యం ఎప్పుడు కూడా ప్లాస్టిక్ మరియు స్టీల్ లేదా గ్లాస్ గిన్నెలలో పెట్టకూడదు.
  • నైవేద్యం ఎప్పుడు కూడా వేడిగా అస్సలు ఉండరాదు అల ఉంటె అది మహా పాపమే అవుతుంది.
  • నైవేద్యం పెట్టేటప్పుడు ఎప్పుడు మధ్యలో నీళ్ళు చల్లుతూ ఉండాలి.
  • నైవేద్యం ఎప్పుడు కూడా చేసింది చేసినట్టుగా పెట్టాలి కానీ దేవుడి కోసం విడిగా పెడితే అది మంచిది కాదు.

నైవేద్యం ఇలాగా పెడితే చాలా మంచిది

  • నైవేద్యం పెట్టిన తరువాత తప్పనిసరిగా హారతి ఇవ్వాలి. అది కూడా ఎవరైతే నైవేద్యం దేవుడికి పెడతారో వాళ్ళే హారతి కూడా ఇవ్వాలి.
  • నైవేద్యం పెట్టిన తరువాత ఒక 5 నిముషాలు అలాగా వదిలేసి మనం పూజ గదిలో నుండి వచ్చేయాలి,ఇలాగా చేస్తే దేవుడి చూపు ఆ ప్రసాదం పైన పడుతుంది.

నైవేద్యం ఎవరైతే వండుతారో వాళ్ళే నైవేద్యం దేవుడికి సమర్పించాలి. ఒకవేళ అలా అవ్వని స్తితిలో స్వామివారిని నేను చేసిన ప్రసాదం నా తరపున ఫలానా వ్యక్తి పెడుతున్నారు నైవేద్య అపరాధం ఉంటె క్షమించు అని అనవచ్చు

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...