మరో షాకిచ్చిన మోడీ ….. MP , MLA ల ఖాతాలపై ఆరా

November 29, 2016

షాకుల మీద షాకులు ఇస్తున్న మోడీ , ఇప్పుడు రాజకీయనాయకులకే నేరుగా షాక్ ఇవ్వబోతున్నాడు.ఆపరేషన్ బ్లాక్ మనీ.. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ వైపు తిరిగింది. రాజకీయ నేతల చరిత్ర కూడా బయటకు తీయటానికి మరో అడుగు ముందుకేశారు ప్రధాని మోడీ.

modie

బ్యాంకు ఖాతాల్లోని డబ్బు, లావాదేవీల వివరాలు వెల్లడించాలని దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆదేశించారు మోడీ. నోట్ల రద్దు ప్రకటన వెలువడిన నవంబర్ 8 నుంచి డిసెంబర్ 31 వరకు తమ బ్యాంకు లావాదేవీలను వివరాలను జనవరి ఒకటవ తేదీన పార్టీ జాతీయ అధ్యక్షుడికి సమర్పించాలని కోరారు. బీజేపీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా బ్యాంకు ఖాతాల వివరాలు వెల్లంచాలన్నారు.

నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ నేతలకు ముందుగానే నోట్ల రద్దు విషయం తెలుసని.. వాళ్లందరూ ఎప్పుడో జాగ్రత్త పడ్డారన్న ఆరోపణలు ప్రతిక్షాల నుంచి వస్తున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే మోడీ ఈ విధంగా సూచించి ఉండొచ్చు అంటున్నారు పార్టీ నేతలు

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...