ప్రధాని మోడీ హత్యకు ఆ నలుగురూ ఎలా కుట్ర చేసారంటే ………

November 29, 2016

పేలుళ్ళ ద్వారా ప్రధాని మోడీని హత్య చేసేందుకు పన్నిన కుట్రను ఎన్ఐఎ భగ్నం చేసింది. తమిళనాడులో నలుగురు అల్ ఖాయిదా సానుభూతిపరులైన ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. ఆ ఉగ్రవాదుల గ్యాంగ్ లీడర్ హకీం చివరి క్షణంలో తప్పించుకున్నాడు. అతని కోసం దర్యాప్తు బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.

modii

వివరాల్లోకి వెళితే …………

మధురైకి చెందిన అబ్బాస్ ఆలీ , అయూబ్ ఖాన్ , అబ్దుల్ కరీం లను ఎన్ఐఎ అధికారులు అరెస్టు చేసారు.

అబ్బాస్ ఆలీ ఒక పెయింటర్ గా ఉండి , ఇటీవలే మత గ్రంథాలతో కూడిన ఒక లైబ్రరీని తెరిచాడు . అబ్దుల్ కరీం కు ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉంది . విచారణలో ఈ ముగ్గురూ ఇచ్చిన సమాచారంతో చెన్నైలో ఒక ఐటీ సంస్థలో సిస్టం అనలిస్టుగా పని చేస్తున్న దావూద్ సులేమాన్ ను కూడా అరెస్టు చేసి విచారిస్తున్నారు. మదురైలో ముగ్గురు అనుచరులు అరెస్టు అయ్యారనే విషయం తెలిసిన వెంటనే ఈ అబ్దుల్ సులేమాన్ మదురై నుండి చెన్నైకి పారిపోయాడు. అప్పటికే అక్కడ కాపు కాసిన ఎన్ఐఎ అధికారులు వల పన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురికీ దేశంలో జరిగిన అనేక బాంబుపేలుళ్ళ లో ప్రమేయం ఉంది. ఈ నలుగురి వద్దా భారీగా పేలుడు పదార్థాలు , నగదు , సెల్ ఫోన్లు లభ్యమయ్యాయి.

నెల్లూరు కోర్టులో జరిగిన బాంబు పేలుడు సందర్భంగా దొరికిన ఒక కరపత్రం ఆధారంగా ఎన్ఐఎ అధికారులు దర్యాప్తు జరిపారు. ఈ విచారణలో దిగ్భ్రాంతి గొలిపే సమాచారం లభ్యమైంది. ప్రధాని మోడీతో సహా మొత్తం 22 మంది నేతల హత్యకు వ్యూహరచన చేశారని , దక్షిణ భారతదేశంలో ఉన్న వివిధ దేశాల కాన్సులేట్లను పేల్చివేయడానికి కుట్ర పన్నారని తేలింది. నలుగురు తీవ్రవాదుల వేటలో ఏపీ , తెలంగాణా పోలీసులు కూడా సహకరించారు. నలుగురికీ నాయకుడిగా ఉన్న హకీం పరారు అయినట్లు ఎన్ఐఎ అధికారులు గుర్తించారు. అతని కోసం తమిళనాడు సరిహద్దుల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...