మెగా జాబ్ మేళాలు – నిరుద్యోగులందరికీ శుభవార్త

February 12, 2017

నిరుద్యోగులందరికీ శుభవార్త ఇది. మెగా జాబ్ మేళాలు జరుగుతున్నాయి. ట్రేడ్ హైదరాబాద్.కామ్ ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు. నిన్నటి  (ఫిబ్రవరి 11) నుంచి జూలై 15వ తేదీ వరకు తెలంగాణలోని జిల్లా కేంద్రాల్లో మేళాలు నిర్వహిస్తున్నారు.

42 రకాల ఉద్యోగాలకు 180 కంపెనీలు తరలివస్తున్నాయి. మొబైల్ కంపెనీలు, స్టోర్స్, పేటీఎం, ఐటీ కంపెనీలు, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్, షాపింగ్ సెక్టార్, ఫ్యాషన్, హెల్త్, సర్వీస్ రంగాల్లో ఉద్యోగులను తీసుకోనున్నారు. నిన్న (ఫిబ్రవరి 11వ తేదీ) కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మేళా నిర్వహించారు.

దీని తర్వాత.. హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్, నల్గొండ, వనపర్తి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో ఈ మేళాలు వరసగా జరగనున్నాయి.

ప్రతి శని, ఆదివారాల్లో ఈ మేళాలు ఉండనున్నాయి.

ఏడో తరగతి నుంచి ఇంజనీరింగ్, ఫార్మా ఉత్తీర్ణత అయిన నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయని వెల్లడించింది కంపెనీ. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ద్వారా సంప్రదించాలని కోరారు ప్రతినిధులు.

7 Comments

on మెగా జాబ్ మేళాలు – నిరుద్యోగులందరికీ శుభవార్త.
 1. Devarapalli Gowrisankar
  |

  I am searching from finansh and marketing profill

 2. J.santosh kumar
  |

  Nise work

 3. P.RAMBABU
  |

  I am degree completed BSC.BBC BIOTECHONOLOGY

 4. Pavan
  |

  I’m MSW

 5. Mekala Naresh
  |

  12th

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...