జియో సరి కొత్త ఆఫర్లను ప్రకటించిన ముఖేష్ అంబానీ

December 1, 2016

రిలయన్స్ జియో ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాట .తాజాగా జియో సరికొత్త ఆఫర్లను ప్రకటించారు రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబాని. ప్రారంభించిన మూడు నెలల్లోనే రికార్డులు సృష్టించిందని.. ఐదు కోట్ల 20 లక్షల మంది జియో సిమ్ లు వినియోగిస్తున్నారని ప్రకటించారు.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా జియో నెట్ వర్క్ అభివృద్ధి చెందుతుందన్నారు. ఐదు నిమిషాల్లోనే సిమ్ యాక్టివేషన్ పూర్తవుతుందని.. ఆపరేటింగ్ వ్యవస్థలోనే బిస్ట్ ఆపరేటర్ గా జియో నిలిచిందన్నారు.

jioo

జియో ఆఫర్లు:

… మొబైల్ నంబర్ పోర్టబలిటీకి అవకాశం ఇస్తున్నాం.

… జియో సిమ్ లను హోమ్ డెలివరీ చేస్తున్నాం

… డిసెంబర్ 31 నుంచి ఇంటికే జియో సిమ్ ల పంపిణీ

… డిసెంబర్ 4 నుంచి కొత్త కస్టమర్లకు భారీ ఆఫర్లు

…  డిసెంబర్ 4వ తేదీ నుంచి మార్చి 31 వరకు ఫ్రీ ఆఫర్ వర్తిస్తుంది.

… పాత కస్టమర్లకు కూడా ‘జియో హ్యాపీ న్యూ ఇయర్’ పేరుతో మార్చి 31 వరకు ఉచిత సేవలు

… జియో సిమ్ ఉన్న ప్రతి ఒక్కరికీ మార్చి 31వ తేదీ వరకు ఉచిత సేవలు అందుతాయి.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...