జియో అదిరిపోయే కొత్త ఆఫర్ ఇదే

November 28, 2016

టెలికాం రంగంలో సంచ‌ల‌నం సృష్టించిన జియో మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించేందుకు సిద్ద‌మ‌వుతోంది. వెల్‌క‌మ్ ఆఫర్ పేరుతో మూడు నెల‌ల‌పాటు ఉచిత వాయిస్‌, డాటాల‌ను వినియోగ‌దారుల‌కు ప్ర‌క‌టించిన జియో… ఈ ఆఫ‌ర్‌ను వ‌చ్చే ఏడాది మార్చి 2017 వ‌ర‌కు పొడ‌గించ‌నుంది.

jio

ప్ర‌స్తుత ఆఫ‌ర్ మ‌రో నెల‌రోజుల్లో ముగియ‌నుండ‌గా.. ఈ ఆఫ‌ర్‌ను పొడిగించేందుకు స‌న్నాహాలు చేస్తోంది రిల‌య‌న్స్ జియో. పొడిగింపునకు సంబంధించి రిల‌య‌న్స్ వ్య‌వ‌స్థాప‌కుడు ధీరూభాయ్ అంబానీ జ‌యంతి రోజున అంటే డిసెంబర్ 28న ఓ ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశ‌మున్న‌ట్లు విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. అంతేకాదు ఉచిత డాటా, వాయిస్ కాలింగ్ స‌ర్వీసుల‌ను మ‌రో ఏడాది వ‌ర‌కు పొడిగించే అవ‌కాశం కూడా ఉన్న‌ట్లు మ‌రో వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇదే నిజ‌మైతే వినియోగ‌దారుల‌కు పండ‌గే.

జియోను త‌ట్టుకునేందుకు ముఖేష్ అంబానీ సోద‌రుడు, ఆర్‌కాం సంస్థ అధినేత అనిల్ అంబానీ కూడా కొద్దిరోజుల క్రితం బంప‌రాఫ‌ర్ ప్ర‌క‌టించారు. రూ.149తో రీఛార్జ్ చేసుకుంటే అన్ని నెట్‌వ‌ర్క్‌ల‌కు అన్‌లిమిటెడ్ కాలింగ్‌తోపాటు.. 300 MB ఉచిత డేటాను ప్ర‌క‌టించారు. జియో ఆఫ‌ర్ కేవ‌లం 4జీ నెట్‌వ‌ర్క్‌కే ప‌రిమితం కాగా.. చిన్న అంబానీ ఇచ్చిన ఆఫ‌ర్ 2జీ, 3జీ, 4జీల‌కు కూడా వ‌ర్తిస్తుంది.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...