ఆ సైనికుల భార్యలు చూపిన సాహసం ఎంత గొప్పదంటే ……….

December 1, 2016

జమ్మూలోని నగ్రోటాలో సైనిక స్థావరంపై పోలీసు దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు దాడి చేసారు. ఆర్మీ ఆర్టిలరీ యూనిట్ లోకి చొరబడిన ఉగ్రవాదులు , తర్వాత ఆర్మీ క్వార్టర్స్ లోకి ప్రవేశించి జవాన్ల కుటుంబాలను బందీలుగా తీసుకునేందుకు యత్నించారు. వారి యత్నాలను సైనికాధికారుల భార్యలు ఎంతో సాహసంతో తిప్పికొట్టారు.

nagrota-attack

ఇంట్లో ఉన్న మంచాలు , బీరువాలు , ఫ్రిజ్జులు ……… వంటి సామాన్లన్నీ తీసుకొచ్చి క్వార్టర్స్ ప్రధాన ద్వారం వద్ద అడ్డుపెట్టి ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఒకవైపు సైనికులు తరుముతుండటం ……. మరోవైపు సైనికుల భార్యలు ఎదురుదాడి చేయడంతో ఉగ్రవాదులు ఆర్మీ క్వార్టర్స్ లోకి ప్రవేశించలేకపోయారు.

అప్పటికే ముగ్గురు ఉగ్రవాదులు రెండు భవనాల్లోకి ప్రవేశించి , సైనికులపైకి కాల్పులు ప్రారంభించారు. ఆ భవనాల్లో పన్నెండు మంది సైనికులు , ఇద్దరు మహిళలు , నెలల వయసున్న ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వారిని రక్షించే క్రమంలో ఏడుగురు సైనికులు వీర మరణం పొందారు. ఎట్టకేలకు వ్యూహాత్మకంగా ఉగ్రవాదులపై దాడి చేసిన సైనికులు వారిని మట్టుబెట్టారు. ఆ భవనాల్లో మరో ఉగ్రవాది సజీవంగా ఉండొచ్చన్న ఉద్దేశ్యంతో కూంబింగ్ ఆపరేషన్ జరుపుతున్నారు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...