అమెరికాలో భారతీయులకు ఇక ఉద్యోగాలు కష్టమేనా ……?

November 29, 2016

అందరూ అనుకున్నట్లుగానే అవుతోంది. డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టక ముందే భారత ఐటి కంపెనీలు జాగ్రత్త పడుతున్నాయి. అక్కడి స్థానిక ఐటి కంపెనీలను కొనుగోలు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అమెరికన్ల ఉద్యోగాలను దెబ్బతీస్తున్న హెచ్‌1బి వంటి వీసాలపై వేటు తప్పదని ట్రంప్‌ ఇప్పటికే స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఈ వీసాలను ఎక్కువగా ఉపయోగించుకుంటోంది భారత ఐటి కంపెనీలే. ట్రంప్‌ హయాంలో ఈ అవకాశం బాగా తగ్గిపోనుంది. అయితే భారత ఐటి కంపెనీల ఆదాయంలో ఇప్పటికే సింహభాగం అమెరికా నుంచే వస్తోంది.

america

దీంతో అక్కడి ఐటి కంపెనీలను కొనుగోలు చేయడంతో పాటు, అక్కడ యూనివర్సిటీలు, కాలేజీల నుంచే ఉద్యోగులను రిక్రూట్‌ చేసుకోవడం ద్వారా వ్యాపారం కాపాడుకోవాలని భారత ఐటి దిగ్గజాలైన ఇన్ఫోసిస్‌, టిసిఎస్‌, టెక్‌ మహీంద్రా, విప్రో వంటి కంపెనీలు భావిస్తున్నాయి.

ఇన్ఫోసిస్‌ ఇప్పటికే ప్రతి త్రైమాసికంలో అమెరికాలో కొత్తగా 500-700 మంది ఉద్యోగులను తీసుకుంటోంది. వీరిలో 80 శాతం మంది స్థానికులే కావడం విశేషం.
స్థానిక కంపెనీలను కొనుగోలు చేయడం ద్వారా, ట్రంప్‌ ప్రభుత్వం స్వీయ రక్షణ వాణిజ్య విధానాలు అనుసరించినా తమ వ్యాపారానికి పెద్దగా నష్టం ఉండదని భారత ఐటి కంపెనీల అంచనా. ఈ ఆలోచనతోనే ఇన్ఫోసిస్‌ గత ఐదేళ్లలో 200 కోట్ల డాలర్లు అమెరికాలో పెట్టుబడులు పెట్టింది.

ఐఒటి, క్లౌడ్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌ వంటి సరికొత్త ఐటి సేవలకు పనికొచ్చే అమెరికా కంపెనీలపై భారత ఐటి కంపెనీలు దృష్టి పెట్టాయి. వీటితో పాటు హెల్త్‌కేర్‌, ఫైనాన్సియల్‌ టెక్నాలజీ కంపెనీలపైనా దృష్టి పెట్టాయి. దీనివల్ల ఖర్చులు పెరిగి లాభాలు తగ్గుతాయని భావిస్తున్నారు. లాభాలు తగ్గినా ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా మార్కెట్‌ను కాపాడుకోవాలంటే ‘స్థానిక’ పాట పాడక తప్పేలా లేదు

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...