బార్డర్ లో ఉన్న ఒక సైనికుని గుండెల్లోని బాధ ఇది

January 10, 2017

మన బార్డర్ లో ఉన్న సైన్యంలో జవాన్ల పరిస్థితిపై విడుదలైన ఓ వీడియో ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఆహారం కోసం సైనికులు ఎలా ఇబ్బంది పడుతున్నారు.. ఖాళీ కడుపులతో రాత్రులు ఎలా అలమటిస్తోందీ.. సరిహద్దుల్లో ఎలాంటి కష్టాలు పడుతున్నది కళ్లకు కట్టాడు ఓ జవాన్.

దేశం కోసం  అంతగా కష్టపడుతున్నా.. అవినీతితో దేశం ఎలా నాశనం అవుతుందన్న విషయాలపై తన భావాలను ఆ వీడియోలో కళ్లకు కట్టాడు ఓ జవాన్.

జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దు భద్రతా దళంలోని 29వ బెటాలియన్‌కి చెందిన తేజ్‌ బహదూర్‌ యాదవ్‌ అనే సైనికుడు.. జవాన్లు పడుతున్న కష్టాలను వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.

ja1

వీడియోలో.. తను ఏ ప్రభుత్వానికి.. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదని స్పష్టం చేశాడు. అవినీతిమయమైన అధికారుల గురించే మాట్లాడతున్నానని కుండబద్దలు కొట్టాడు. ఫిర్యాదులు చేయడం లేదని.. తమ బాధలు చెప్పుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు.

జవాన్లకు కల్పించాల్సిన సౌకర్యాలు మాత్రం అందడంలేదని బాధపడ్డాడు ఆ జవాన్. సైన్యానికి వెచ్చించిన నిధులను ఉన్నతాధికారులు తినేస్తున్నారని ఆరోపించారు. మాడిపోయి.. ఎండిపోయిన రొట్టె ముక్కలు, నీళ్ల టీ తాగుతున్నామంటూ జవాన్ల దుస్థిని వెలుగులోకి తెచ్చారీ జావన్.

10 గంటలు డ్యూటీ చేసి రాత్రికి పసుపు, ఉప్పుకలిపిన సూప్‌ తాగుతూ ఖాళీ కడుపుతో భద్రతను చూస్తున్నామని తమ దైన్యపరిస్థితిని వెల్లడించారు. దేశమంతటా ఎంతో గర్వంగా చెప్పుకునే జవాన్లు అనుభవిస్తున్న క్షోభ గురించి అందరికీ తెలియాలనే.. వీడియో తీసినట్టు తెలిపారు.

సరిహద్దుల్లో పడుతున్న కష్టాలను ఉన్నతాధికారులు, ప్రభుత్వం గుర్తించే వరకు ఈ అన్యాయాన్ని ఎప్పటికప్పుడు వీడియో రూపంలో తీసి పోస్ట్‌ చేస్తుంటానని బహదూర్‌ స్పష్టంచేశారు

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...