ఆ ఇద్దరు IAS ల పెళ్ళి ఖర్చు 500/- రూపాయలు

November 30, 2016

ఈ మధ్య కాలంలో జరుగుతున్న పెళ్ళిళ్ళన్నీ హంగూ ఆర్భాటాలతో లక్షలకు లక్షలు ఖర్చు పెట్టేవే. ఒకరిని మించి మరొకరు పోటీ వాతావరణంలో ఆడంబరాలతో అనవసర వృధా ఖర్చులు పెడుతున్నారు.

అలాంటి మనుషులున్న ఈరోజుల్లో …….. ఇద్దరు ఐఏయస్ లు నిరాడంబరంగా చేసుకున్న వివాహం అందరికీ ఆదర్శనీయమై , చర్చనీయాంశంగా మారింది.

ias

అందరికీ వాళ్లిద్దరూ IASలు. ప్రభుత్వ బంగళాలు, సర్కార్ కార్లు ఇచ్చింది. ఎక్కడికి వెళ్లినా దర్జాగానే వెళ్లొచ్చు. టాప్ ర్యాంక్ ఆఫీసర్లు. వాళ్లిద్దరూ ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారు.

28వ తేదీన పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి అయిన ఖర్చు కేవలం రూ.500 మాత్రమే.

పెళ్లి కొడుకు ఆశిష్ వశిష్ట, మధ్యప్రదేశ్ కేడర్ కు చెందిన IAS అధికారి. గోహాడ్ లో SODగా విధులు నిర్వహిస్తున్నారు. వశిష్టది రాజస్థాన్. ఇక పెళ్లికూతురు సలోని సిదానా. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో SDMగా పని చేస్తున్నారు. సలోనిది పంజాబ్ రాష్ట్రం. IAS పరీక్షలో టాపర్ గా నిలిచింది. 2013 బ్యాచ్ కు చెందిన వీళ్లద్దరూ.. ముస్సోరి శిక్షణ సమయంలో ప్రేమించుకున్నారు.

పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాత.. మధ్యప్రదేశ్ లోని బింద్ రిజిస్ట్రార్ ఆఫీసులో మ్యారేజ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఫీజు కింద రూ.500 చెల్లించారు.

28వ తేదీ ఉదయం పెళ్లి సమయానికి ఇద్దరి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. దండలు మార్చుకుని… సంతకాలు పెట్టి ఒక్కటి అయ్యారు. పెళ్లితో వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఈ కాలంలో.. ఈ ఇద్దరు IAS ఆఫీసర్లు సాదాసీదా వివాహం చేసుకోవటం ఎందరికో ఆదర్శం అంటున్నారు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...