ఇలా చేస్తే ………. గుండె జబ్బులు అస్సలు రావు

January 14, 2017

మన అలవాట్లు , మనం తినే తిండే మన ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. మనం తినే ప్రతిదీ మనకూ, మన గుండెకూ శక్తినిచ్చేదే. అయితే మనం ఒక్క శక్తినే చూసుకోకూడదు.. మంచి ఆరోగ్యాన్ని కూడా ఇచ్చేదాన్నే తినటం, అలాంటి వాటినే ఎంచుకోవటం ముఖ్యం.

hert

* బాగా శుద్ధి చేసి, తినటానికి సిద్ధంగా తయారుచేసి మార్కెట్లలో అమ్ముతుండే (ప్రాసెస్డ్‌, ప్యాకేజ్డ్‌) పదార్ధాలు ఎక్కువగా తినకండి. వీటిలో పంచదార, ఉప్పు, నూనెలు, ఇతర కొవ్వులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యాన్ని దెబ్బతీసేవే.

* ఆఫీసులకు, స్కూళ్లకు వెళ్లేవాళ్లు రోజూ క్యాంటీన్లలో తినొద్దు. చక్కటి ఆరోగ్యకరమైన ఆహారం, ఇంట్లో వండుకున్నదే తెచ్చుకు తినండి.

* కూల్‌డ్రింకులు మానెయ్యండి. పండ్ల రసాలు కూడా బాగా తగ్గించెయ్యండి. అలాగే స్వీట్లు, తీపి పదార్ధాలకు సాధ్యమైనంత దూరంగా ఉండండి. వీటి బదులుగా తాజా పండ్లు ఎక్కువగా తినండి, అవి ఆరోగ్యానికి, తద్వారా గుండెకు ఎంతో మేలు చేస్తాయి.

* పండ్లుగానీ, కూరగాయలుగానీ.. రోజు మొత్తమ్మీద 5 కప్పులకు తక్కువ లేకుండా తినండి. పండ్లు- తాజాగా ఉన్నా, ఫ్రిజ్జులో పెట్టినవైనా, ఎండువైనా కూడా ఫర్వాలేదు.

* మద్యం మానెయ్యటం ఉత్తమం.

ఇవి పాటిస్తే ………. తప్పకుండా గుండె జబ్బులు మన దరి చేరవు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...