ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా ………? అయితే 50 పైసలే వడ్డీ

November 30, 2016

మనలో చాలా మంది సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. పెద్ద నోట్ల రద్దుతో ఆ కల ఇక కలగానే మిగలనుందా అన్న  భయాన్ని దూరం చేసే పనిలో పడింది కేంద్రం. పెద్దనోట్ల రద్దుతో కలిగే ప్రయోజనాల్లో మొట్టమొదటి ప్రయోజనం సొంతిల్లు కట్టుకోవడమేనని చెబుతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చాలా వేగంగా చేస్తోంది. దీనిలో భాగంగా ఓ కొత్త పథకాన్ని తీసుకొస్తోంది.

house

అదేమిటంటే …………

ఈ పథకం కింద రూ.50 లక్షల మొత్తం వరకూ గృహరుణాలపై 6 – 7శాతం వడ్డీని మాత్రమే వసూలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. అంటే ఇది సుమారు 50 నుంచి 75 పైసలు ఉంటుంది.  అయితే ఈ అవకాశాన్ని కేవలం మొదటిసారి ఇల్లు కొనుక్కునే వారికి మాత్రమే ఇవ్వాలని భావిస్తోంది ఆర్థిక శాఖ. పెద్ద నోట్ల రద్దుతో వచ్చే ఆదాయాన్ని బట్టి మరిన్ని వెసులుబాటులు కల్పించే అవకాశముందని చెబుతున్నారు ఆర్థిక శాఖ అధికారులు.

ఆర్థికశాఖఇప్పటికే ఈ అంశంపై భారత రిజర్వు బ్యాంకుతో ప్రాధమిక చర్చలను ప్రారంభించింది. ఈ చర్చలు ఒక కొలిక్కివచ్చిన తర్వాత 2017లో ప్రకటించే అవకాశం ఉంది. పెద్దనోట్ల రద్దు అనంతరం ఇళ్ల కొనుగోళ్లు మందగించాయి. అయితే, ఈ మందకొడి పరిస్థితి తాత్కాలికమేనన్నది కేంద్రం అంచనాగా ఉంది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో పెద్ద మొత్తాల్లో నగదు డిపాజిట్లు భారీగా పెరిగిన దరిమిలా డిసెంబరు నెలాఖరు నాటికల్లా బ్యాంకులు గృహరుణాల వడ్డీ రేట్లను తగ్గించేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఎక్కువ మంది ఇళ్లను కొనుక్కొనే అవకాశముందంటున్నారు ఆర్థిక నిపుణులు

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...