హీరో విశాల్ ఆ మహిళను ఆదుకొని , మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు

December 1, 2016

విశాల్ – రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ హీరోనే అని అనేక సార్లు నిరూపించుకున్నాడు. స్పందించే గుణంతో ఎందరినో ఆదుకుంటున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే , తమిళ చిత్ర సీమలో అరుదైన వ్యక్తిత్వం హీరో విశాల్‌ది. తన పని తాను చేసుకుని కోట్లు వెనకేసుకుందాం అనుకునే రకం కాదు. అన్యాయాన్ని ఎదురించి పోరాడే మనిషి. ఎవరైనా కష్టాల్లో ఉంటే సహాయం చేసే వ్యక్తిత్వం గలవాడు. ఇది వరకే ఎంతో మందికి సహకరించిన విశాల్‌ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు.

vishal

అనేక మంది తమిళ స్టార్‌ హీరోలతో కలిసి పనిచేసిన వెటరన్‌ సంగీత దర్శకుడు చంద్రబోస్‌ కుటుంబానికి విశాల్‌ సహాయం అందించి తన పెద్ద మనసు చాటుకున్నాడు. చంద్రబోస్‌ మరణం తర్వాత ఆయన భార్య చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

భర్త ఉన్నప్పుడు ఎంతో వైభవోపేతంగా బతికిన ఆమె వద్ద ప్రస్తుతం మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. ఈ విషయం తెలుసుకున్న విశాల్‌ స్వయంగా ఆమెను కలిసి డబ్బులు అందజేశాడట. ఇలాంటి సహాయాలతో విశాల్‌ తెరపైనే కాదు నిజజీవితంలో కూడా హీరో అనిపించుకుంటున్నాడు. హ్యాట్సాఫ్ టు హీరో విశాల్.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...