ఈ నిరుపేద అబ్బాయి గుండెల్లోని బాధ మనసుల్ని కదిలిస్తుంది

February 17, 2017

మంచి మనసులతో అందరమూ స్పందిద్దాం
ఈ అబ్బాయి కష్టాన్ని కొంతవరకైనా తీరుద్దాం
**************************************
“ అమ్మా ….. ఆకలవుతోందమ్మా…..! “ అని
ఈ అబ్బాయి అడగాలని చూస్తాడు .
కానీ అడగలేడు…… ఎందుకంటే , ఇతనికి మాటలు రావు ,
కడుపు మీద కొట్టుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు .

“ బాబూ ….! తినడానికి ఏమీ లేదమ్మా “ అని
ఆ తల్లి చెప్పాలనుకుంటుంది
కానీ చెప్పలేదు ……
ఎందుకంటే , ఆమెకు కూడా మాటలు రావు ,
ఖాళీ పాత్రను తెచ్చి చూపిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది.

ఇది ఓ నిరుపేద తల్లీ కొడుకుల మూగరోదన
గుండెల్ని పిండేసే వేదన

ఈ అబ్బాయి పది సంవత్సరాల వరకు బాగా మాట్లాడేవాడు . అలాగే బాగా వినపడేది కూడా .

కానీ అకస్మాత్తుగా మాట్లాడటం ఆగిపోయింది, వినబడటం కూడా పూర్తిగా నిలిచి పోయింది.

పూట గడవడమే కష్టమైన పేదరికంలో పుట్టిన ఈ అబ్బాయి తల్లికి కూడా మూగ , చెవుడు. వీటితో పాటుగా కుడి చేయి కూడా సరిగా పని చేయదు.

ఇన్ని కష్టాలను నెట్టుకుంటూ , కొడుకును చూస్తూ ……
కన్నీళ్లను దిగమింగుకుంటూ ఆ తల్లి కుమిలి పోతోంది.

ఇళ్ళను కట్టించే ఒక మేస్త్రీ దగ్గర ఈ అబ్బాయి
కూలి పనికి వెళుతున్నాడనీ , వీళ్ళ కుటుంబం తీవ్రమైన కష్టాల్లో ఉందనీ …… ఒక మిత్రుని ద్వారా
మా స్నేహహస్తం డెవలప్ మెంట్ సొసైటీ దృష్టికి వచ్చింది.

వీళ్ళ దయనీయమైన పరిస్థితిని మేము గమనిస్తే ,
అత్యంత దీనమైన వీళ్ళ స్థితి గతులు మాకు చాలా బాధను కలిగించాయి.

ఈ అబ్బాయి కూలి పని చేస్తే వచ్చే డబ్బులతో ఆ కుటుంబం గడుస్తోంది. ఈ అబ్బాయి తండ్రి అనారోగ్యంతో మంచంలో కదలలేని స్థితిలో ఉన్నాడు . ఆ తల్లి బాధను ఇక మాటలలో వర్ణించలేము.

ఈ అబ్బాయి కూలి పనులు చేసే చోట , వాళ్ళు చెప్పేది వినపడక ….. ఇతను తిరిగి చెప్పుకోలేక , నరకాన్ని అనుభవిస్తూ ఏడ్చుకుంటున్నాడు.

ఈ అబ్బాయిని డాక్టర్ దగ్గరకు తీసుకు వెళితే , లోపలి చెవికి , మధ్య చెవికి సంబంధించిన చికిత్సలు చేసి , ట్రీట్ మెంట్ ఇస్తే వినికిడి శక్తి వచ్చే అవకాశం ఉందనీ …….. కొంతకాలం పాటు వైద్య చికిత్సలు చేస్తే , మాటలు వచ్చే అవకాశం కూడా చాలా ఉందని వైద్యులు పేర్కొన్నారు. కానీ వేలాది రూపాయలు ఖర్చయ్యే ఈ వైద్య చికిత్సలకు పెట్టుకునే ఆర్ధిక స్థోమత వీళ్ళ దగ్గర లేదు.

కాబట్టి మనమందరమూ
మన మనసుకు తోచినంతగా చేయూతనిద్దాం .

ఈ అబ్బాయికి కొత్త జీవితాన్ని ప్రసాదిద్దాం

మానవత్వంతో స్పందించాలనుకుంటే ……

M. LAKSHMI SUJATHA ,
STATE BANK OF HYDERABAD ( SBH ) ,
A/C NUMBER : 62501875927 ,
IFSC CODE : SBHY0020570 ,
PRODDATUR BRANCH

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...