జిమ్ కు వెళుతున్నారా ….? అయితే ఇవి తప్పకుండా పాటించండి …. లేకుంటే …..

November 28, 2016

జిమ్ చేయడానికి ముందు మరియు తర్వాత అనుసరించాల్సిన ఆరోగ్య సూత్రాల గురించి మీకు తెలుసా……….? అయితే ఒక్కసారి దీనిని చదవండి.

జిమ్ చేయడానికి ముందు మరియు తర్వాత పాటించాల్సిన కొన్ని ఆరోగ్య సూత్రాలు:

మీరు జిమ్‌కు వెళ్లడానికి ముందు మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోవాలి, ముఖ్యంగా మీరు మీ ఆఫీసు సమయం తర్వాత జిమ్‌కు వెళ్లే సందర్భంలో అయితే ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. స్నానం చేయడం మంచిది మరియు మరీ ఎక్కువ కాకుండా కొంచెం మోతాదులో పెర్ఫ్యూమ్ ఉపయోగించడం మంచిది.

ఎల్లప్పుడూ సౌకర్యవంతంగా మరియు వదులుగా ఉండే దుస్తులను ధరించడం ఉత్తమం. చెమటను పీల్చే కాటన్ దుస్తులను ధరించడం చాలా మంచిది.

gym

రాపిడి సంభవించే శరీర భాగాలకు (ఉదా. గజ్జలు, చంకలు మొదలైన) పెట్రోలియం జెల్లీని పూయడం ద్వారా ప్రత్యేక జాగ్రత్తలను పాటించాలి.

ఏదైనా జిమ్ పరికరాన్ని ఉపయోగించడానికి ముందు మరియు తర్వాత మీ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. హ్యాండ్ శానిటైజర్ కలిగి ఉండటం మంచిది.

వ్యాయామం చేస్తున్నప్పుడు చెమట పట్టాలి. కాని వ్యాయామం చేసే సమయంలో చెమటతో ఇబ్బందిపడాలని ఎవరూ భావించరు. కనుక ఎల్లప్పుడూ శుభ్రమైన తువాలును తీసుకుని వెళ్లండి మరియు ఉపయోగించిన తర్వాత పరికరాన్ని శుభ్రం చేసినట్లు నిర్ధారించుకోండి.

మీరు తరచూ నీరు తాగడం మంచిది, దీని వలన మీరు ఉత్సాహంగా వ్యాయామం చేయగలరు. ప్లాస్టిక్ సీసాలు కాకుండా లోహపు సీసాలను ఉపయోగించడానికి ప్రయత్నించండి. ప్లాస్టిక్ సీసాను పూర్తిగా శుభ్రం చేయడం సాధ్యం కాదు కనుక దానిలో క్రిములు ఉండిపోవచ్చు. అయితే, లోహపు సీసాలను సబ్బుతో కడిగి, వేడి నీటితో శుభ్రం చేయవచ్చు. అలాగే, మీరు గమనించని సమయంలో మీ సీసాలోని నీటిని మరొకరు తాగడం లేదని నిర్ధారించుకోండి.

వ్యాయామాన్ని పూర్తి చేసిన తర్వాత, మీ చెమటతో నిండిన దుస్తులను అలాగే జిమ్ బ్యాగులో పారవేయరాదు, దానిని జాగ్రత్తగా ప్లాస్టిక్ సంచిలో ఉంచాలి. అలాగే కొద్దిగా ఆరిన దుస్తులను ఎక్కువసేపు వాషింగ్ మెషీన్‌లో ఉంచి శుభ్రం చేయడం వలన కూడా క్రిములు రావచ్చు. ముందుగా దుస్తులను పూర్తిగా ఆరబెట్టి, తర్వాత వాటిని శుభ్రం చేయాలి మరియు సాధ్యమైతే వాటిని వేరేగా శుభ్రం చేయడం మరీ మంచిది. శుభ్రం చేసిన తర్వాత కూడా దుర్వాసన వస్తే, మళ్లీ దానిని శుభ్రం చేయాలి. అలాగే వాటిని మళ్లీ శుభ్రం చేయకుండా ధరించడం మంచిది కాదు.

అలాగే, మీరు జిమ్ కోసం ధరించే షూలను కూడా శుభ్రంగా చూసుకోవాలి, ముందుగా మీ షూలను ఒక ప్లాస్టిక్ సంచిలో ఉంచి, ఆ సంచిని మీ జిమ్ బ్యాగులో ఉంచాలి. మీరు ఇంటికి వచ్చిన వెంటనే, శుభ్రమైన గుడ్డతో వాటిని శుభ్రం చేయండి మరియు వాటిని మర్నాడు ఉపయోగించడానికి అలానే గాలిలో ఆరబెట్టండి. మీరు షూల నుండి వచ్చే దుర్వాసనను నివారించడానికి టీ సంచులను కూడా వాటిలో ఉంచవచ్చు.

మీరు హెల్త్ క్లబ్ షవర్ ఉపయోగిస్తుంటే, చెప్పులు ధరించండి. ఇవి మీ పాదాలకు సోకే ఇన్ఫెక్షన్‌ల నుండి సంరక్షిస్తాయి. అయితే ఇవి నీటిలో తడిసినప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్‌ల సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

వ్యాయామం చేసిన తర్వాత సోఫాలో విశ్రమించడం చాలా హాయిగా ఉంటుంది, కాని సోఫాలో విశ్రమించవద్దు. తక్షణమే స్నానం చేయండి, కాని ముందుగా తగినంత విశ్రాంతి తీసుకోండి!!

వ్యాయామం చేసిన తర్వాత ప్రతిసారి మీ జుట్టుకు షాంపు “ఉపయోగించరాదు”. తరచూ షాంపూ ఉపయోగించడం వలన మీ జట్టు పొడిగా మారి, ఊడిపోయే అవకాశం ఉన్నందున బదులుగా కండీషనర్ ఉపయోగించండి.

మీరు రొంపతో బాధపడుతున్నా లేదా ముక్కు కారుతున్నా జిమ్‌కు వెళ్లవద్దు. జిమ్‌కు ఆ రోజు వెళ్లకపోవడం వలన మీరు త్వరగా కోలుకోవచ్చు, అలాగే ఇతరులకు ఇన్ఫెక్షన్ సోకకుండా నివారించవచ్చు. మీకు ఏదైనా గాయమైన సందర్భంలో కూడా ఈ సూత్రాన్నే పాటించాలి

 

1 Comment

on జిమ్ కు వెళుతున్నారా ….? అయితే ఇవి తప్పకుండా పాటించండి …. లేకుంటే …...
  1. Linga
    |

    Good suggessions

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...