ఆ ఇయర్ బడ్స్ వాడుతున్నారా ………… ? అయితే జాగ్రత్త

November 29, 2016

చెవులను శుభ్రం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో , మనలో చాలా మంది ఇయర్ బడ్స్ ను వాడుతూ ఉంటారు. ఆ ఇయర్ బడ్స్ పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే పలు వైరల్ , ఫంగల్ ఇన్ఫెక్షన్లు వైద్య పరిశోధనల్లో తేలింది.

ear-buds

వివరాల్లోకి వెళితే ,

మనం వాహనాల్లో ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గానీ , బస్ స్టాండ్ లేదా రైల్వే స్టేషన్లలో కొందరు ఇయర్ బడ్స్ ను అమ్ముతూ కనిపిస్తారు. షాపుల్లో దొరికే వాటి కంటే , ఇవి ధర తక్కువని చాలా మంది కొంటూ ఉంటారు. కానీ అవి చాలా ప్రమాదకరం.

erbds

ఎందుకంటే , వాటిలో వాడే దూది , ఆసుపత్రులలో వాడి ప్రక్కన పడేసిన మలినమైనది ఉపయోగిస్తున్నట్లుగా తెలిసింది. ఆ దూదితో తయారు చేసిన ఇయర్ బడ్స్ ను వాడితే చెవులకు వైరల్ ఇన్ఫెక్షన్లు సోకుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. కాబట్టి బ్రాండెడ్ ఇయర్ బడ్స్ నే వాడండి.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...