చేతివేళ్లు చూపిస్తూ ………. ఫోటోలు దిగుతున్నారా ……? అయితే జాగ్రత్త

January 13, 2017

జపాన్ పరిశోధకులు మరో కొత్త విషయాన్ని కనిపెట్టారు. బయోమెట్రిక్‌ వేలిముద్రలతో సెల్‌ఫోన్‌, ఇతర పరికరాలు, అకౌంట్లు లాక్‌ చేయడం సురక్షితం అనుకుంటున్న సమయంలో జపాన్‌ నిపుణులు అందరూ ఆశ్చర్యపోయే విషయాన్ని బయటపెట్టారు.

మూడు మీటర్ల లోపు దూరం నుంచి మంచి కాంతిలో, స్పష్టంగా తీసిన ఫొటోలలోని చేతి వేళ్లను హ్యాకర్లు సులభంగా కాపీ చేయగలరని జపాన్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేటిక్స్‌ పరిశోధకులు కనుగొన్నారు.

fingers

మామూలుగా చేతి వేళ్లు చూపిస్తూ దిగిన సెల్ఫీ నుంచి కూడా వేలి ముద్రలను హ్యకర్లు కాపీ చేయగలరని ప్రొఫెసర్‌ ఐసాఓ ఇఛీజెన్‌ చెప్పారు.

అయితే, ఈ పరిజ్ఞానం ఇంకా అందుబాటులోకి రాలేదని, కానీ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చేతి వేళ్ల కొనలు ఫొటోల్లో కనిపించకుండా చేసే పారదర్శకమయిన టైటానియమ్‌ ఆక్సైడ్‌ ఫిల్మ్‌ను జపాన్‌ శాస్త్రవేత్తలు తయారు చేశారు.

కానీ, చేతి వేళ్లు ఫొటోల్లో కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...