పాత 500 రూపాయల నోట్ల చెలామణీ కి రేపే ఆఖరి రోజు

December 1, 2016

మరో షాక్ …..రూ.500 నోట్ల చెల్లుబాటు తేదీని కుదించింది కేంద్రం. పెట్రోల్ బంకులు, ఎయిర్ పోర్టుల్లో రేపటి వరకు మాత్రమే చెలామణి అవుతాయి. గతంలో డిసెంబర్‌ 15 వరకు పెట్రోల్‌ బంకులు, విమాన ప్రయాణాలకు రూ.500 నోట్లకు అనుమతి ఇచ్చింది కేంద్రం. అయితే ఈ వెసులుబాటును డిసెంబర్ 2 తేదీ అర్థారాత్రికి కుదిస్తున్నట్లు తాజాగా నిర్ణయించింది.

jf

పెట్రోల్‌ బంకులు, విమానాల్లో డిసెంబర్‌ 2 తర్వాత పాత రూ.500 నోట్లు స్వీకరించొద్దని ఆయా సంస్థలకు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు టోల్ గేట్ల దగ్గర కూడా రేపు అర్ధరాత్రి నుంచి టోల్‌ రుసుములు వసూళ్లు యథావిధిగా ఉంటాని కేంద్రం ప్రకటించింది. టోల్‌ ట్యాక్స్ లను డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా చెల్లించేందుకు ఏర్పాట్లు చేసింది.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...