మీ ఇంట్లో స్మార్ట్ ఫోన్ , కంప్యూటర్ ఉంటే …. మీ పిల్లల కోసం ఒక్కసారి చదవండి

January 10, 2017

నేటి కాలంలో ఇళ్ళల్లో అధికంగా వాడుతున్న స్మార్ట్ ఫోన్ , కంప్యూటర్ల వల్ల చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం పడుతోందని అనేక పరిశోధనలు తెలియజేస్తున్నాయి.

స్మార్ట్‌ఫోన్‌, కంప్యూటర్‌ వాడకంతో చిన్నారులలో డ్రై ఐ డిసీజ్‌(డీఈడీ) ముప్పు పెరుగుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తు న్నారు. ఇటీవలి కాలంలో పిల్లలు బయటకెళ్లి ఆడుకోవడంకంటే స్మార్ట్‌ ఫోన్లు, కంప్యూటర్ల ముందరే గడపడం ఎక్కువైందని చెప్పారు. ఇది కళ్లు పొడిబారడం సహా పలు వ్యాధులకు కారణం అవుతోందని హెచ్చరించారు.

lap

ఈమేరకు చిన్నపిల్లల్లో స్మార్ట్‌ఫోన్‌ వాడకంపై దక్షిణ కొరియాలోని ఛుంగ్‌ యాంగ్‌ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లోని చిన్నారులలో స్మార్ట్‌ఫోన్‌, కంప్యూటర్‌ వాడకం 61.3 శాతంగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 51శాతం ఉందని, డీఈడీ ముప్పు పట్టణ ప్రాంతాల పిల్లలకు 8.3 శాతం ఉండగా, గ్రామీణ చిన్నారులలో 2.8 శాతంగా ఉందని పరిశోధకులు తెలిపారు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...