పాన్ కార్డులో ఎలాంటి మార్పులు రాబోతున్నాయంటే ………..

January 14, 2017

పాన్ కార్డు గురించి మనలో చాలా మందికి తెలుసు. మనీ లావాదేవీలకు ఇది ఇప్పుడు ముఖ్యమైపోయింది. ఎక్కువ మొత్తంలో డబ్బులు ట్రాన్సాక్షన్ చేయాలన్నా..ఐడీ ఫ్రూప్ గా కూడా పాన్ కార్డ్ అవసరం.

తాజాగా పాన్ కార్డు దరఖాస్తు  చేసుకునే వారికి…మళ్లీ మార్చడానికి వేల్లేకుండా.. కొత్త లుక్ తో సరికొత్త ఫీచర్లతో పాన్ కార్డును ఇవ్వనున్నారు ఐటీ అధికారులు.

pan card

ఈనెల నుంచి.. కొత్త కార్డులను ఇవ్వనున్నట్లు తెలిపారు పాన్ సిబ్బంది. వీటిలో వివరాలు.. ఇంగ్లీష్‌, హిందీలో ఉంటాయన్నారు. పాన్ కార్డులను NSDL,UTIISL ప్రింట్ చేస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం ఉన్న కార్డుదారులు కూడా కొత్త కార్డు కావాలంటే దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఈ కార్డులో కొత్తగా క్విక్‌ రెస్పాన్స్‌ కోడ్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చామని… ఇది వెరిఫికేషన్‌ ప్రక్రియలో సాయపడుతుందని తెలిపారు.

ఈ కార్డును ట్యాంపర్‌ చేయడానికి ఎలాంటి అవకాశం ఉండదన్నారు.

ప్రస్తుతం దేశంలో 25 కోట్ల మందికిపైగా పాన్‌ కార్డులుండగా.. ఏటా 2.5 కోట్ల దరఖాస్తులు వస్తున్నాయి

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...