బైక్ నడిపే వాళ్ళందరినీ షాక్ కు గురిచేసిన కేంద్రం నిర్ణయం

February 19, 2017

ప‌గ‌లు కూడా లైట్లు వేసుకునే ద్విచ‌క్ర‌వాహ‌నాలు న‌డ‌పాల‌ని కేంద్రం ఆదేశాలు జారీ చేయ‌డంతో త‌ప్ప‌నిస‌రైంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి విక్రయించే వాహనాల్లో ‘ఆటోమేటిక్‌ హెడ్‌ల్యాంప్‌ ఆన్‌ (ఏహెచ్‌వో)’ టెక్నాలజీని తప్పనిసరి చేస్తూ కేంద్ర రవాణ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పాత వాహనాలకు వర్తించదు.

2017 నుంచి విడుద‌ల‌య్యే ద్విచ‌క్ర వాహ‌నాలు ఏఓహెచ్  టెక్నాల‌జీతో రానున్నాయి. అంటే కేంద్రం జారీ చేసిన ఆదేశాలను అమ‌లు చేస్తూ ద్విచ‌క్ర‌వాహ‌నాలు రూపుదిద్దుకుంటున్నాయి.

బైక్ ఇంజిన్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా హెడ్‌లైట్ వెలుగుతుంది. మ‌ళ్లీ ఇంజిన్ ఆఫ్ చేసిన‌ప్పుడు మాత్ర‌మే లైట్ కూడా ఆఫ్ అవుతుంది. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఈ నిబంధనను అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ప‌గ‌లుపూట భారీ వాహ‌నాలకు ఎదురుగా వ‌స్తున్న ద్విచ‌క్ర‌వాహ‌నాలు క‌నిపించ‌క‌పోవ‌డంతో పెద్ద ఎత్తున ప్ర‌మాదాలు జ‌రిగి చాలామంది మృతిచెందుతున్నారని నివేదిక‌లు పేర్కొంటున్నాయి.

రహదారుల భద్రతపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్న విధానాలను పరిశీలించి ద్విచక్ర వాహనాల లైట్‌ పగటి పూటా వెలిగించాలని సూచనలు చేసింది. యూరప్, మలేషియా వంటి చాలా దేశాల్లో 2003 నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...