BSNL బంపర్ ఆఫర్ ……… వైఫై ఫ్రీ ….. ఫ్రీ ….. ఫ్రీ …..

January 13, 2017

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) శుక్రవారం మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది.  తమ చందాదారులకు  వాల్డ్ వైడ్ గా ఫ్రీ వైఫై సదుపాయాన్ని కల్పిస్తోంది. తన కస్టమర్లకు అపూర్వమైన  డాటా ను అందించేందుకు టాటా కమ్యూనికేషన్స్ తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది.

హై క్వాలిటీ, వేగవంతమైన  డాటా అందించేలా  టాటా కమ్యూనికేషన్స్ తో వై ఫై,  వైఫై క్లౌడ్ కమ్యూనికేషన్స్ కో్సం ఒక భాగస్వామ్యాన్ని BSNL ప్రకటించింది.

BSLN

దాదాపు 100కు పైగా దేశాల్లో 4.4 కోట్ల వై ఫై హాట్ స్పాట్లను ఏర్పాటు చేయనుంది.   అంతర్జాతీయ విమానాలు, రైల్వేలతో సహా  ఈ సర్వీసులను అందుబాటులోకి తేనున్నట్టు టాటా కమ్యూనికేషన్స్ బీఎస్ఈ  ఫైలింగ్ లో తెలిపింది.

టాటా కామ్ బిఎస్ఎన్ఎల్ చందాదారులు ఇతర దేశాల్లో ప్రయాణించే టైంలో ప్రపంచంలో  వైఫై  నెట్ వర్క్ కు  అనుమతి ఉంటుందని తెలిపింది. అంతేకాదు వివిధ పాస్ వర్డ్ లను గుర్తుంచుకోవడంలో గజిబిజి లేకుండానే….వై ఫై  హాట్ స్పాట్ కు ఒక్కసారి నమోదు  అయితే చాలని  చెప్పింది.

దీంతో వారు వేరు వేరు నగరం, దేశం లేదా ఖండం ఎక్కడున్నా  సమీపంలోని  వైఫైకి ఆటోమేటిగ్గా కనెక్ట్  అవుతారని  టాటా కామ్  తెలిపింది

 

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...