కొత్త నోట్లు వచ్చాయి కదా…… ATM లో సరిగా ప్రింట్ కాని లేదా నకిలీ కరెన్సీ వస్తే , ఏం చేయాలంటే…..

November 28, 2016

కొత్త కరెన్సీ నోట్లు నిదానంగా ప్రజల చేతుల్లోకి వస్తున్నాయి. చాలా మంది ఏది నకిలీనో , ఏది ఒరిజినలో తెలుసుకోలేని పరిస్థితి లో ఉన్నారు.

అలాంటి పరిస్థితిలో , ఏటీఎంల‌లో న‌కిలీ నోట్లు వ‌చ్చినా, సరిగ్గా ప్రింట్ అవ్వని నోట్లు వచ్చినా… వాటిని తిరిగి ఇచ్చి బ్యాంకుల ద్వారా అస‌లైన నోట్లు ఎలా పొంద‌వ‌చ్చో ఒక్కసారి చదివి తెలుసుకోండి.

ఏటీఎంలో న‌కిలీ నోట్లు రాగానే వెంట‌నే  అక్క‌డ ఉండే సెక్యూరిటీ గార్డుకు ఈ విష‌యాన్ని తెలియ‌జేయాలి. ఇటీవ‌లి కాలంలో దాదాపు అధిక శాతం ఏటీఎంల వ‌ద్ద సెక్యూరిటీ గార్డులు ఉంటున్నారు. కాబ‌ట్టి న‌కిలీ నోట్లు రాగానే ఆ గార్డుకు విష‌యం చెప్పి అత‌ని వ‌ద్ద ఉండే రిజిస్ట‌ర్‌లో మీరు డ్రా చేసిన మొత్తం, న‌కిలీ నోట్లు ఎన్ని వ‌చ్చాయి, ఏయే నోట్లు వ‌చ్చాయి, వాటి నంబ‌ర్లు, మీరు లావాదేవీ నిర్వ‌హించిన స‌మ‌యం, తేదీ, ఏటీఎం స్లిప్, దాని ట్రాన్‌సాక్ష‌న్ నంబ‌ర్‌ వంటి వివ‌రాలను అన్నింటిని ఆ రిజిస్ట‌ర్‌లో ఎంట‌ర్ చేసి గార్డు సంత‌కం తీసుకోవాలి.

atmm

వీలైతే ఇప్పుడు చెప్పిన వివ‌రాల‌కు సంబంధించిన ఫొటోల‌న్నింటినీ స్మార్ట్‌ఫోన్ ద్వారా తీసి భ‌ద్ర ప‌రుచుకోవాలి. అనంతరం పైన చెప్పిన ఆయా వివ‌రాల‌కు సంబంధించిన జిరాక్స్ ప్ర‌తుల‌ను తీసి బ్యాంక్‌కు వెళ్లి అక్క‌డి మేనేజ‌ర్‌కు ఫిర్యాదు చేయాలి. బాధితుడు తాను చేసిన లావాదేవీకి సంబంధించిన పూర్తి వివ‌రాల‌తో కూడిన ఓ లెట‌ర్‌ను రాసి మేనేజ‌ర్‌కు ఇవ్వాలి. దానికి ముందు చెప్పిన జిరాక్స్ ప్ర‌తుల‌ను కూడా ఇవ్వాలి.

బ్యాంక్ వారు మీ ద‌గ్గ‌ర ఉన్న న‌కిలీ నోట్ల‌ను తీసుకుని వాటిని త‌మ ద‌గ్గ‌ర ఉండే ప‌రిక‌రాల ద్వారా స్కాన్ చేసి అవి నకిలీ నోట్ల‌నే విష‌యాన్ని ధృవ ప‌రుస్తారు. అనంత‌రం వాటికి బ‌దులుగా మీకు అంతే మొత్తంలో డ‌బ్బును ఇస్తారు

ఆర్‌బీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌తి బ్యాంక్ పైన చెప్పిన విధంగా చేయాల్సి ఉంటుంది. ఒక‌వేళ ఏ బ్యాంక్ అయినా స్పందించ‌క‌పోతే స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసే హ‌క్కు బాధితునికి ఉంటుంది. అంతేకాదు త‌దుప‌రి చ‌ర్య‌గా బాధితుడు ఆర్‌బీఐ సైట్‌(www.rbi.org.in)లో ఉన్న మెయిల్ ఐడీకి త‌మ ఫిర్యాదుతో కూడిన లేఖ‌ను మెయిల్ రూపంలో పంపించ‌వ‌చ్చు. లేదంటే స్థానికంగా ఉన్న బ్యాంకింగ్ అంబుడ్స్‌మ‌న్‌కు ఫిర్యాదు చేయ‌వ‌చ్చు.

అలా ఇచ్చిన ఫిర్యాదుకు ఆర్‌బీఐ లేదా బ్యాంకింగ్ అంబుడ్స్‌మ‌న్ అధికారులు స్పందించి త‌క్ష‌ణ‌మే చ‌ర్య తీసుకుంటారు. బాధితునికి త‌గిన న్యాయం చేస్తారు. ఇప్పుడు తెలుసుకున్నారుగా, ఏటీఎంల‌లో న‌కిలీ నోట్లు వ‌స్తే ఏం చేయాలో. ఈ స‌మాచారాన్ని మ‌రింత మందికి షేర్ చేయడం మ‌రిచిపోకండి. దీని వ‌ల్ల న‌కిలీ నోట్ల‌ బాధితులు ఎవ‌రైనా ఉంటే వెంట‌నే త‌మ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోగ‌లుగుతారు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...