ATM లో దొంగ నోట్లు వస్తే ….. వెంటనే ఏం చేయాలంటే………

October 28, 2016

నగదు లావాదేవీలు ఇప్పుడు అత్యధికంగా ఏటీఎం ల ద్వారానే జరుగుతున్నాయి.

అలాంటి ఎటిఎం మెషిన్ నుండే దొంగనోట్లు వస్తే ఏం చెయ్యాలో మనలో చాలా మందికి తెలియదు.
చాలా కంగారు పడి , ఏం చేయాలో పాలుపోక తికమక పడుతూ ఉంటారు.

ఏటీఎం లలో దొంగనోట్లు వస్తే చాలా మంది వెంటనే బ్యాంకుకి వెళ్లి అడుగుతుంటారు, కాని బ్యాంకు వాళ్ళు తమకు ఏం సంబంధం తెలియ‌ద‌ని స‌మాధానం చెప్ప‌డం, దీంతో బాధితులు బాధ పడటం ఇప్పుడు స‌ర్వ సాధార‌ణం అయింది, అయితే ఏటీఎంల‌లో న‌కిలీ నోట్లు వస్తే వాటిని బ్యాంకు ద్వారానే అసలైన నోట్లని పొందవచ్చు.

atm

ఏటీఎంలో దొంగ నోట్లు వస్తే ఇలా చెయ్యండి:

ఏటీఎంలో నకిలీ నోట్లు వస్తే వెంటనే అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డుకు చెప్పాలి.

సెక్యూరిటీ గార్డు దగ్గర ఉండే రిజిస్ట‌ర్‌లో మీరు విత్ డ్రా చేసిన మొత్తం, ఓట్ల ఎన్ని నకిలీ నకిలీ నోట్లు వచ్చాయి, వాటి నంబర్లు, సమయం, తేది,ఏటీఎం స్లిప్ నెంబర్ వివరాలని రాసి సంతకం చేయాలి.

ఆ తరువాత బ్యాంకుకి వెళ్లి మేనేజర్ కి ఒక లెటర్ ద్వారా కంప్లైట్ చెయ్యాలి, లెటర్ తో పాటు ఏటీఎం స్లిప్ జీరాక్స్, బ్యాంకు పాస్ బుక్ జీరాక్స్ లని జత చేసి, ఏటీఎం వద్ద రిజిస్టర్ లో రాసిన వివరాలని అందించాలి.

బ్యాంకు వారు మీ దగ్గర ఉండే నకిలీ నోట్లని తీసుకోని వాటిని స్కాన్ చేసి నకిలీ నోట్ల కాదా..!
అని పరీక్షిస్తారు.

అవి నకిలీ నోట్లే అయితే మీరు ఇచ్చిన వివరాలని సరి చూసుకొని సరైన నోట్లని తిరిగి ఇస్తారు.

ఇలా కంప్లైంట్ చేసే సమయంలో ఏటియం స్లిప్ ని, నకిలీ నోట్లని, కంప్లైంట్ లెటర్ ని ఫోటోలు తీసి పెట్టుకోవడం ఇంకా మంచిది.

రిజర్వ్ బ్యాంకు నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్రతి బ్యాంకు పైన చెప్పిన విధంగా ఖచ్చితంగా చెయ్యాలి, అలా చెయ్యకుండా తమకు ఏం సంబంధం లేదని బ్యాంకు వారు అంటే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయవచ్చు,లేక పోతే స్థానికంగా ఉండే బ్యాంకింగ్ అంబుడ్స్‌మ‌న్ అధికారులకు కూడా ఫిర్యాదు చేసి వెంటనే వారి నుండి త‌క్ష‌ణ‌ సహాయాన్ని పొంది బ్యాంకు నుండి నకిలీ నోట్లకి బదులు అసలైన నోట్లని పొందవచ్చు

1 Comment

on ATM లో దొంగ నోట్లు వస్తే ….. వెంటనే ఏం చేయాలంటే……….
  1. Ravisankar
    |

    Dear sir
    Information chala bagundi sir
    andariki chala use autundi
    Kani 50-80% ATM’s daggara guards undatam ledu, unna registers undavu, appudu emi cheyyali

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...