సోరియాసిస్ ఉందా……. అయితే ఇవి ఖచ్చితంగా పాటించండి

January 14, 2017

సోరియాసిస్‌…….. ఈమధ్యకాలంలో చాలా మందిని శారీరకంగా , మానసికంగా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న జబ్బు ఇది. దీన్ని నియంత్రించడానికి  ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒక్కసారి చదివి తెలుసుకోండి .

సోరియాసిస్‌ బాధితులు చికిత్స తీసుకోవటంతో పాటు కొన్ని జీవనశైలి మార్పులు తప్పకుండా చేసుకోవాలి. దీంతో జబ్బును బాగా నియంత్రణలో ఉంచుకోవచ్చు.

psoriosis

* ఊబకాయులైతే ఖచ్చితంగా బరువు తగ్గించుకోవాలి.

* మధుమేహం, ఇతర ఆటోఇమ్యూన్‌ జబ్బుల వంటివి గలవారు వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి.

* మద్యం, పొగ తాగటం మానెయ్యాలి.

* సమతులాహారం తీసుకోవాలి. మాంసం మూలంగా యూరిక్‌ యాసిడ్‌ పెరిగి, సమస్య తీవ్రమవుతుంది కాబట్టి మాంసాహారం విషయంలో మితం పాటించాలి. కూరగాయలు ఎక్కువగా తినాలి.

* ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో కూడిన విత్తనాలు, గింజపప్పులు తీసుకోవాలి. అవిసె గింజలు మంచివి.

* క్రమం తప్పకుండా రోజూ వ్యాయామం చేయాలి.

* ఒత్తిడి తగ్గటానికి విశ్రాంతి తీసుకోవాలి. వినోద ప్రాంతాలను సందర్శించాలి. యోగా, ధ్యానం కూడా ఎంతో మేలు చేస్తాయి.

* ఎరిత్రోడెర్మిక్‌, పశ్చులర్‌ సోరియాసిస్‌ గలవారు ఈత కొట్టకూడదు. ఈత కొలనుల్లోని క్లోరిన్‌ చర్మాన్ని చికాకు పెట్టొచ్చు.

* ఎయిర్‌ కండిషనర్లలో ఉండేవారు హ్యూమిడిఫయర్స్‌ వాడుకోవాలి.

* చలికాలంలో సోరియాసిస్‌, దురద ఉద్ధృతమవుతాయి. ఇలాంటివాళ్లు వెచ్చటి దుస్తులు వేసుకోవాలి. చర్మానికి చల్లగాలి తగలకుండా చూసుకోవాలి.

*  సోరియాసిస్‌ బాధితులు గాయాలు కాకుండా చూసుకోవటం మంచిది. ఎందుకంటే వీరికి గాయాల వెంట సోరియాసిస్‌ (కోబ్‌నర్‌ ఫెనామినా) రావొచ్చు

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...