నేషనల్ కెరీర్ సర్వీస్ పథకం – నిరుద్యోగుల కోసం

February 12, 2017

నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌(ఎన్‌సీఎస్‌) పథకాన్ని కేంద్రంఅందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు దీన్ని పోస్టాఫీసు కార్యాలయాలతో అనుసంధానిస్తూ కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

దీనికి సంబంధించి కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తా త్రేయ, భారత తపాలా శాఖ కార్యదర్శి బి.వి. సుధాకర్‌ సమక్షంలో 2 శాఖలు ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ప్రధాన తపాలా కార్యా లయంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. కాగా, దీన్ని ప్రయోగాత్మకంగా మొదట హైదరాబాద్‌ నుంచి ప్రారంభించనున్నారు.

ఉద్యోగార్థులు తమ వివరాలను సమీపంలోని ఎన్‌సీఎస్‌ సెంటర్స్‌ ఉన్న తపాలా కార్యాలయా లకు వెళ్లి అక్కడి కేంద్రంలో వివరాలను నమోదు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లోనే వాటిని పొందుపరుచుకునే వెసులుబాటు ఉంటుంది.

నమోదైన వివరాలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చేరుతాయి. తమకు అవసరమైన అభ్యర్థుల ఎంపిక కోసం అవి జాబ్‌మేళాలు ఏర్పాటు చేస్తాయి. ఆ సమాచారం అభ్యర్థులకు చేరుతుంది. అక్కడ నేరుగా ఆయా సంస్థలు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి.

కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ, తపాలాశాఖలు సంయుక్తంగా చేపట్టనున్న ఈ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించనున్నారు.

7 Comments

on నేషనల్ కెరీర్ సర్వీస్ పథకం – నిరుద్యోగుల కోసం.
 1. |

  Nice information .Thank you sir .

 2. Srinivasulu
  |

  I’m degree B. A completed

 3. psrao
  |

  village people how to apply prime ministers avasa yojana

 4. rajashekar
  |

  My jobs

 5. kumar
  |

  Thank you sir

 6. sunilkumar
  |

  family

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...