సినిమా లను ఒక్క సెకనులోనే డౌన్ లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా ……?

January 9, 2017

3జీ ప్రపంచాన్నిఅరచేతిలోకి తీసుకువస్తే.. దాన్ని 4జీ వేగంగా నడిపిస్తోంది. మరి 5జీ సంగతి ఏమిటి. దేశంలో అత్యధికంగా వినిపిస్తున్న పదం 4జీ… రిలయన్స్ జియో వచ్చిన తర్వాత 4జీ ప్రపంచాన్ని అరచేతిలో పెట్టిన విధానాన్ని చూస్తూనే ఉన్నాం. భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ది చెందుతున్న కమ్యూనికేషన్ రంగంలో ఇదో నవశకం.

ఫోన్ అంటే కేవలం మాట్లాడుకోవడమే కాదు. సినిమాలు, టీవీ చానళ్లు, ఆర్థిక లావాదేవీలు, పేపర్లు ఒక్కటేమిటి కూర్చున్న చోటు నుంచి లేవకుండా ఫోన్ ద్వారా పనులు చక్కబెడుతున్నారు.

5g

సమాచార మార్పిడి మరింత వేగం పుంజుకోవడానికి 2జీ వచ్చింది. 2జీ టెక్నాలజీ గురించి ప్రజలకు తెలియముందే 3జీ వచ్చింది. 3జీ గురించి అర్థం చేసుకునేలోపే 4జీని తీసుకువచ్చారు ఆపరేటర్లు.

జియో 4జీ సిమ్ ఉచితం అంటూ సమాచార విప్లవాన్ని సరికొత్త పుంతలు తొక్కించింది. దేశంలో 4జీ సేవలు ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్నాయి. విదేశాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 4జీ సేవలు చూసి ఉబ్బితబ్బివుతున్న భారతీయులకు 5జీ అందుబాటులోకి వస్తే ఆ ఆనందమే వేరు.

ప్రస్తుతం మనం 4జీ టెక్నాలజీని వాడుతున్నాం. 4జీ స్మార్టుఫోన్లు వీరవీహారం చేస్తున్నాయి. దాదాపు చాలా పనులు 4జీతో జరిగిపోతున్నాయి.

అయితే 5జీ మాటేమిటి. ప్రస్తుతం 4జీ సేవలను విస్తరించేందుకే పలు దేశాలు ఆపసోపాలు పడుతున్నాయి. 5జీ సర్వీసు అందుబాటులోకి వస్తే 800 ఎంబీ సామర్ధ్యం కలిగిన సినిమాను రెప్పపాటులో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని ఇంటర్నెట్ గరిష్ఠ వేగం 1జీబీపీఎస్‌గా ఉంటున్నాయి. 800 మెగాబైట్ల సినిమాను సెకను కన్నా తక్కువ సమయంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గంటకు 500 కిలోమీటర్లు ప్రయాణించే బుల్లెట్ ట్రైన్‌లో కూడా ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు.

5జీ ఎలా ఉంటుంది? అదికానీ అందుబాటులోకి వస్తే ఎలాంటి పరిస్థితులు వస్తాయి? 5జీ సేవలపై తిరుపతిలో జరిగిన సైన్స్ కాంగ్రెస్‌లో ప్రస్తావనకు వచ్చింది. ఇంటర్నెట్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి 5జీ ఇంకా నిర్వచన దశలోనే ఉంది. 2020 నాటికి అది మనదేశంలోకి వస్తుందని భావిస్తున్నారు.

 

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...