సీతాఫలం పండును తింటే ఎన్ని జబ్బులు రావంటే………..

October 6, 2016

సీతాఫలం – మనలో చాలా మంది ఈ పండును అమితంగా ఇష్టపడతారు.
అన్ని ప్రాంతాలలోనూ సీజన్ ను బట్టి ఈ పండ్లు విరివిగా దొరుకుతాయి.

seetha

ఈ పండును గుండె జబ్బు ఉన్నవారు సీజన్‌ ఉన్నంతవరకు తప్పకుండా తింటుంటే……
గుండె సంబందిత సమస్యల నుండి ఉపశమనం ఉంటుంది.
గుండె కొట్టుకునే తీరును సీతాఫలం క్రమబద్ధీకరిస్తుంది.

విటమిన్లు, లవణాలు అధికంగా ఉండి, చలికాలంలో ఎక్కువగా దొరికే ఈ సీతాఫలం మీగడలాంటి గుజ్జుతో, ప్రత్యేక రుచితో చిన్నా, పెద్దా అందరి నోళ్లలోనూ నీళ్లూరిస్తుంది. ఈ పండును సీజన్ ముగిసేంతదాకా ప్రతిరోజూ తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి మంచి చేయటమేగాకుండా, ఎన్నో పోషక విలువలను శరీరానికి అందిస్తుంది.

సీతాఫలంలో కొవ్వు ఏ మాత్రం ఉండదు. ఒక్కో సీతాఫలంలో 200 క్యాలరీలవరకు శక్తి ఉంటుంది. కార్బోహైడ్రేట్లు 48, ఫైబర్ 6 గ్రాముల.. విటమిన్ సి 50 శాతం, కాల్షియం 2 శాతం, ఐరన్ నాలుగు శాతం, సోడియం పది మిల్లీగ్రాములు ఈ పండులో లభిస్తాయి. నీరసంగా ఉన్నప్పుడు ఈ పండ్లను ఒకటి లేదా రెండింటిని తిన్నట్లయితే శరీరానికి కావాల్సినంత గ్లూకోజ్ లభిస్తుంది.

ఈ పండు తింటుంటే కండరాలు బలోపేతం అవుతాయి. బలహీనత, సాధారణ అలసటను సైతం దూరం చేస్తుంది. వాంతులు, తలనొప్పి విరుగుడుగా పనిచేస్తుంది. చర్మ వ్యాధులకు మంచి మందుగా పనిచేస్తుంది. ఇందులోని మెత్తని గుజ్జు పిల్లల ఎదుగుదలకు సహకరిస్తుంది. ఎదిగే పిల్లలకు ఎముకల పుష్టిని కలిగిస్తుంది. ప్రతిరోజూ తింటుంటే జుట్టు నల్లగా ఆరోగ్యంగా మెరుస్తుంది. కుదుళ్లకు దృఢత్వానిస్తుంది.

పేగుల్లో వుండే హెల్మింత్స్‌ అనే నులిపురుగుల నివారణలో సీతాఫలం ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ పండు గుజ్జు అల్సర్లపై చక్కటి మందులాగా పనిచేసి ఉపశమనాన్నిస్తుంది. త్రిదోష నివారిణిగా శరీరంలో వుండే వాత, పిత్త కఫ దోషాన్ని తగ్గించడంలో ప్యూరిఫైర్‌గా పనిచేస్తుంది.

ముఖ్య గమనిక :
***********
ఆస్తమా ఉన్నవారు మాత్రం ఈ సీతాఫలంను తీసుకోకూడదు.

మధుమేహం ఉన్నవారు తినకూడదు.
ఒకవేళ తినాలనిపిస్తే మామూలుగా పండిన పండును మాత్రం తింటే ఎలాంటి బాధా ఉండదు.
అదే ఎక్కువగా పండిన పండును మాత్రం తిన్నట్లయితే అందులో గ్లూకోజ్‌ శాతం ఎక్కువగా ఉండి,
చక్కెర వ్యాధి గ్రస్తులకు ఎక్కువగా హాని చేస్తుంది.

అలాగే లివర్‌ వ్యాధితో, మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు సైతం ఈ సీతాఫలానికి దూరంగా ఉండాలి.

1 Comment

on సీతాఫలం పండును తింటే ఎన్ని జబ్బులు రావంటే………...
  1. CHALLA Seshaiah
    |

    Thanks

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...