500 , 1000 Rs కరెన్సీ ని రద్దు చేయమని ప్రధానికి సలహా ఇచ్చింది ఇతనే

November 10, 2016

పాత 500/-, 1000/- నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించి దేశాన్ని ఒక కుదుపు కుదిపి బ్లాక్ మనీ హోల్డర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు ప్రధాని నరేంద్రమోడీ. అయితే దేశంలోని లంచగొండితనాన్ని, ఫేక్ కరెన్సీని నిర్మూలించడం కోసం గతంలో అనిల్ బొకిల్ అనే ఓ సామాజిక కార్యకర్త సూచించిన అర్థక్రాంతి పథకాన్ని అనుసరించే, ప్రధాని మోడీ దేశ ఆర్థిక వ్యవస్థను మార్చే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.!

anil-bokil

అసలు అర్థక్రాంతి పథకం అంటే ఏమిటంటే……….

అర్థక్రాంతి అనేది.. పన్నుల వ్యవస్థలో సమూల మార్పులను సూచిస్తున్న ఆర్థిక సిద్ధాంతం. దిగుమతి సుంకాలు మినహా దేశంలో అమలులో ఉన్న 56 రకాల పన్నులను పూర్తిగా రద్దు చేయాలని, అన్నిరకాల లావాదేవీలు బ్యాంకుల ద్వారానే జరగాలని, ప్రతి లావాదేవీపైనా 2% పన్ను మాత్రమే విధించాలని, రూ.2000/-లకు మించిన లావాదేవీలపై చట్టబద్ధ పరిమితి ఉండాలని చెప్పేదే ఈ సిద్దాంతం.

అర్థక్రాంతి వల్ల ఎవరెవరికి , ఎలా ప్రయోజనాలు కలుగుతాయంటే………..

1. ప్రభుత్వాదాయం ఊహించని విధంగా పెరిగి ఖజానా కళకళలాడుతుంది.

2. ఆదాయపన్ను రద్దువల్ల ఉద్యోగులకు పూర్తి జీతాలు చేతికొస్తాయి. వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది.

3. పన్నుల మోత లేనందువల్ల పెట్రోలు, డీజిలు సహా అన్ని వస్తువుల ధరలూ
సుమారు 40శాతం మేర తగ్గుతాయి.

4. పన్నుల ఎగవేత వూసే ఉండదు. నల్లధనానికి ఆస్కారంలేని వ్యవస్థలు సాకారం అవుతాయి.

5. అధికవిలువ గల కరెన్సీ నిలిచిపోతుంది. ఫలితంగా దొంగనోట్ల చలామణికి అవకాశమే ఉండదు.
అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది.

6. GST కూడా….అర్థక్రాంతి సిద్దాంతం సూచించిన ప్రతిపాదనే.

అర్ధక్రాంతి పక్కగా అమలు చేస్తే కలిగే లాభాలు:
**********************************
• భారత్‌ స్థూల జాతీయోత్పత్తి కేవలం 50లక్షల కోట్లు కాగా
ఇక్కడి నల్లడబ్బు 70లక్షల కోట్లు అని అంచనా…
ఇది పక్కగా అమలు చేస్తే 70 లక్షల కోట్ల బ్లాక్ మనీ బయటికొస్తుంది.

• చైనా ప్రభుత్వం 6శాతం రేటుకు రుణాలిస్తుండగా భారత్‌ 15శాతానికి ఇస్తున్నదన్నారు.
ఇది పక్కగా అమలు చేస్తే….5% వడ్డీరేటుకు లోపే రుణాలు పొందొచ్చు.

• వ్యవసాయానికి అధిక సబ్సిడీలు, ప్రభుత్వ పథకాలకు అధిక నిదులు వచ్చే అవకాశం ఉంది.

• స్థానిక సంస్థలు బలోపేతం అవుతాయి.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...