5 నిమిషాల్లోనే 5 గంటల చార్జింగ్. ఎలాగంటే………….

November 20, 2016

5 నిమిషాల్లోనే.. ఐదు గంటల ఛార్జింగ్
***************************
ఒక్కసారి చార్జింగ్ పెడితే రోజంతా చార్జింగ్ ఉండే రోజులు పోయాయి.

ఇప్పుడు 24 గంటలూ మొబైల్ ఆన్ లోనే ఉండటంతో ఖాళీగా ఉన్నప్పుడల్లా చార్జింగ్ పెట్టాల్సిన పరిస్థితి.
రోజంతా బయట తిరగాలంటే చార్జింగ్ కోసం వెతుక్కోవాలి. అర గంట పెడితే ఒక్క పాయింట్ కూడా రాదు..

కొత్తగా వచ్చిన టెక్నాలజీ ఈ కష్టాలన్నింటికీ చెక్ పెడుతోంది.

mobicha

జస్ట్ 5 నిమిషాలు చార్జింగ్ పెడితే చాలు, ఐదు గంటల బ్యాకప్ వచ్చేలా క్విక్ చార్జ్ 4.0 అనే టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొచ్చింది క్వాల్‌కామ్ సంస్థ.

స్మార్ట్‌ఫోన్ ప్రాసెసర్లను తయారు చేసే క్వాల్‌కామ్ సంస్థ కొత్తగా స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్‌ను విడుదల చేస్తుంది. ఈ ప్రాసెసర్‌తో వచ్చే ఫోన్లు, టాబ్లెట్లు యూజర్లకు అమితమైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇవ్వనున్నాయి.

క్విక్ చార్జ్ 4.0 ఉన్న డివైస్‌లను కేవలం ఐదు నిమిషాలు చార్జింగ్ పెడితే చాలు, ఐదు గంటల బ్యాకప్ వస్తుంది. మళ్లీ ఐదు గంటల తర్వాతే డివైస్‌ను చార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఇది ప్రయాణాల్లో ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుంది.

క్విక్ చార్జ్ 4.0 టెక్నాలజీ ఉన్న డివైస్‌లను 30 నిమిషాల పాటు చార్జింగ్ పెడితే చాలు చార్జింగ్ 100 శాతం పూర్తవుతుంది. దీని వల్ల యూజర్లకు డివైస్‌లలో చార్జింగ్ అయిపోతుందన్న బెంగ ఉండదు.

క్విక్ చార్జ్ 4.0 ఉంటే డివైస్‌ల బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువగానే వస్తుంది.
ఎన్ని పనులు చేసుకున్నా బ్యాటరీ డౌన్ కాదు.

2017లో స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్లు రానున్న క్రమంలో సదరు ప్రాసెసర్లతోపాటు ఈ క్విక్‌చార్జ్ 4.0 టెక్నాలజీ కూడా కంబైన్డ్‌గా యూజర్లకు అందుబాటులోకి తేవాలనుకుంటుంది క్వాల్‌కామ్ సంస్థ.

ఇప్పటి వరకు వచ్చిన స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్లు ఉన్న ఫోన్లలో క్విక్ చార్జ్ 2.0, 3.0 టెక్నాలజీలు ఉండగా, త్వరలో 4.0 వినియోగదారులకు అందుబాటులోకి రానుంది

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...