అద్భుతం …… 200 ఏళ్ళుగా ఇలాగే ఎలా ఉన్నాడంటే ………..

January 13, 2017

ఇదొక అద్భుతమైన విషయం. అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే విషయం. మంగోలియాలో పోయిన సంవత్సరం వెలుగుచూసిన ఒక బౌద్ధ సన్యాసి మమ్మీపై ఇప్పుడు పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఇది దాదాపుగా రెండు శతాబ్దాల నాటి మమ్మీ అని ఫోరెన్సిక్ నిపుణులు చెబుతుండగా… బౌద్ధుల వాదన మాత్రం మరోలా ఉంది. ఆయన చనిపోలేదనీ.. ధ్యానంలో ఉచ్ఛ స్థితికి చేరుకోవడం వల్లే అలా ఉన్నారని చెబుతున్నారు. ఈ స్థితిని టుక్డమ్ అని పిలుస్తారనీ… ఈ దశ దాటితే ఆయన నిజమైన బుద్దుడిగా మారినట్టేనంటున్నారు. అలా మారినవారు ఇతరులను సైతం బాగుచేయగలరని బౌద్ధులు నమ్ముతారు.

mongolia

2015 జనవరిలో కొందరు వ్యక్తులు బ్లాక్ మార్కెట్లో అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా మంగోలియా అధికారులు ఈ మమ్మీని స్వాధీనం చేసుకున్నారు.

ఈ వ్యక్తి 200 యేళ్ల క్రితం జీవించాడని గుర్తించిన ఫోరెన్సిక్ నిపుణులు… ఇప్పటికీ ఆయన దేహంపై పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నారు.

జంతుచర్మంతో శరీరం పాడవకుండా భద్రపరచగలగడం.. ఇప్పటికీ కూర్చున్ని దేహం కూర్చున్నట్టుగానే ఉండడం నిపుణులైన శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కడం లేదు.

200 యేళ్లుగా శరీరంలో ఎలాంటి మార్పు చోటు చేసుకోనందున దీనిని ఆథ్యాత్మిక మిస్టరీగానే భావించాలనీ… ఈ మిస్టరీని శాస్త్రవేత్తలు పరిష్కరించాలని పరిశీలకులు అంటున్నారు.

మరోవైపు పద్మాసనంలో కూర్చుని ధ్యానం చేస్తున్నట్టున్న ఈ మమ్మీని.. బుర్యాత్ బుద్ధ సన్యాసి లామా దాషి లిటిగిలోవ్‌ అని మరికొంతమంది చెబుతున్నారు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...