వాట్సాఫ్ లో వీడియో కాలింగ్ ఆప్షన్

November 18, 2016

వాట్సఫ్ ……….. వాట్సఫ్ …….. వాట్సఫ్ ………
పేస్ బుక్ తర్వాత అత్యధికంగా ప్రజాదరణ పొందింది ఇదే.

చాటింగ్, మెసేజింగ్ లో సంచలనం సృష్టించిన వాట్సప్ తన వినియోగదారులకు మరో శుభవార్త అందించింది.

మెసేజింగ్, చాటింగ్ లతోపాటు వాయిస్ కాలింగ్ ఇదివరకే ఉన్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం వీడియో కాలింగ్ ఫీచర్ ని ప్రవేశపెట్టింది వాట్సప్‌ గ్రూప్.
ఈ ఫీచర్ ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి వచ్చింది.

whatsapp

ఈ యాప్‌కు చెందిన లేటెస్ట్ సాఫ్ట్ వేర్ వెర్షన్‌ను (ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్) వాళ్ల మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ కు తగ్గ వెర్షన్ను ఎంచుకొని డౌన్‌లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకుంటే చాలు.
వాట్సాప్ వీడియో కాలింగ్ ఫ్యూచర్ అందుబాటులోకి వస్తుంది.

వీడియో కాలింగ్ ఫీచర్‌ తో ఒకరినొకరు లైవల్ లో చూసుకుంటూ మాట్లాడుకోవచ్చు.

వీడియో కాలింగ్ ఎలా వాడాలి అంటే……

… వీడియోకాలింగ్ చేయాలనుకునే యూజర్లు ఏదైనా కాంటాక్ట్ ను ఓపెన్ చేయాలి

… అనంతరం కాల్ బటన్‌ను ప్రెస్ చేయాలి

… వాయిస్ కాల్, వీడియో కాల్ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి

… అప్పుడు వీడియో కాల్‌ను ఎంచుకుంటే చాలు, దాంతో అవతలి వ్యక్తులకు వీడియో కాల్ వెళ్తుంది

… వాట్సప్ లేటెస్ట్ వెర్షన్ ను ఇద్దరు వ్యక్తలు అప్‌డేట్ చేసుకోవాలి

… అప్పుడే వీడియోకాలింగ్ ఫీచర్ వర్క్ అవుతుంది

… లేదంటే ఎర్రర్ మెసేజ్ కనిపిస్తుంది

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...