రోజుకు 5 స్పూన్ లు ఈ ద్రావణాన్ని త్రాగితే చాలు – అన్ని జబ్బులూ దూరం

November 10, 2016

ఇంతకుముందు మీరు ఎన్నోరకాల ఆయుర్వేద ద్రావణాలను గానీ మిశ్రమాలను గానీ ఉపయోగించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే ద్రావణం అత్యంత ప్రభావవంతమైనది మరియు ఎన్నో రకాలుగా ఆరోగ్యానికి ఉపయోకరమైనది.

dr1

ఆ ద్రావణం ఏమిటో, దాన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వెల్లుల్లి ముక్క‌లు – 1/4 క‌ప్పు

ఉల్లిపాయ ముక్క‌లు – 1/4 క‌ప్పు

ప‌సుపు – 2 టేబుల్ స్పూన్లు

యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ – 700 ఎంఎల్

బాగా పండిన మిర‌ప కాయ‌లు – 2

తురిమిన అల్లం – 1/4 క‌ప్పు

తురిమిన ముల్లంగి – 2 టేబుల్ స్పూన్లు

త‌యారు చేసే విధానం…
******************
వెనిగర్ త‌ప్ప మిగిలిన అన్ని ప‌దార్థాల‌ను ఒక పాత్ర‌లో వేసి బాగా క‌లుపుకోవాలి.
దాన్ని ఒక జార్‌లోకి మార్చాలి. ఆ జార్‌లోకి యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను వంపాలి.
దీంతో జార్ నిండా నిండిపోతుంది. తర్వాత జార్‌ను మూసి బాగా షేక్ చేయాలి.

చ‌ల్ల‌గా, పొడిగా ఉండే వాతావ‌ర‌ణంలో ఆ జార్‌ను 2 వారాల పాటు అలాగే ఉంచాలి.
నిత్యం ఆ జార్‌ను బాగా షేక్ చేస్తూ ఉండాలి.

14 రోజుల త‌రువాత జార్ ఓపెన్ చేసి అందులోని మిశ్ర‌మాన్ని పిండుతూ ద్ర‌వాన్ని వేరు చేసుకోవాలి.
అలా వ‌చ్చిన ద్ర‌వాన్ని మ‌ళ్లీ ఇంకో బాటిల్‌లోకి సేక‌రించి దాన్ని నిల్వ చేసుకోవాలి. ఈ ద్ర‌వాన్ని ఫ్రిజ్‌లో పెట్టాల్సిన ప‌నిలేదు. అయితే ద్ర‌వాన్ని వేరు చేయ‌గా వ‌చ్చిన మిశ్ర‌మాన్ని వంటల్లోనూ వాడుకోవ‌చ్చు.

పైన చెప్పిన విధంగా సేక‌రించిన ద్ర‌వాన్ని ప్రతిరోజూ 60 ఎంఎల్ మోతాదులో
రోజులో ఏదో ఒక స‌మ‌యంలో తీసుకోవాలి. కానీ ప‌ర‌గ‌డుపున మాత్రం తాగ‌కూడ‌దు.
వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు ఎక్కువ‌గా ఉన్న‌వారు 100 ఎంఎల్ వ‌ర‌కు తాగ‌వ‌చ్చు.

లేదంటే 50 ఎంఎల్ చొప్పున రెండు సార్లు, 1 టేబుల్ స్పూన్ చొప్పున అయితే
5 నుంచి 6 సార్ల వ‌ర‌కు ఒక రోజులో తాగ‌వ‌చ్చు. అయితే ఈ ద్ర‌వం రుచిలో కొంత ఘాటుగా ఉంటుంది. దాన్ని త‌ట్టుకోలేమ‌నుకునే వారు కొద్దిగా నీటికి క‌లిపి తీసుకోవ‌చ్చు.

ఇంట్లోనే మీరు ఈ విధంగా పైన చెప్పిన ద్ర‌వాన్ని టానిక్ రూపంలో నిత్యం తాగుతుంటే దాంతో మీ శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ చాలా శక్తివంతంగా మారుతుంది. ఈ టానిక్‌లో స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ వైర‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ పారాసైటిక్ గుణాలు పుష్క‌లంగా ఉంటాయి. దీని వ‌ల్ల మీ శ‌రీరంలో ఉన్న ఎలాంటి ఇన్‌ఫెక్ష‌న్ అయినా చాలా వేగంగా త‌గ్గుముఖం ప‌డుతుంది.

ఈ టానిక్‌లో ఉన్న వెల్లుల్లి స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్‌గా పనిచేస్తూ వ్యాధులను న‌యం చేస్తుంది. బాక్టీరియా, సూక్ష్మ క్రిముల‌ను నిర్మూలిస్తుంది. ఉల్లిపాయ రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తుంది. ప‌సుపు నొప్పులు, వాపుల‌ను త‌గ్గిస్తుంది. బాక్టీరియాల‌ను అంతం చేస్తుంది. క్యాన్స‌ర్ క‌ణాల‌ను నాశ‌నం చేస్తుంది. యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ కార‌కంగా ప‌నిచేస్తుంది. బ‌రువును కూడా త‌గ్గిస్తుంది.

మిర‌ప‌కాయ‌లు రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను పటిష్టం చేస్తూ బాక్టీరియాల‌ను నిర్మూలిస్తాయి. అల్లం యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ, యాంటీ బయోటిక్‌, యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ స్పాస్మోడిక్ గుణాల‌ను క‌లిగి ఉంది. ఆస్త‌మా, బీపీల‌ను నియంత్రిస్తుంది. ముల్లంగి శ్వాస కోశ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తుంది.

ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తుంది. ఇన్ని ప‌వ‌ర్‌ఫుల్ గుణాలు ఉన్న ప‌దార్థాల‌ను వాడుతాం కాబ‌ట్టే పైన చెప్పిన ద్ర‌వం అత్యంత స‌హ‌జ సిద్ధ‌మైన‌, ప‌వ‌ర్‌ఫుల్ ఇమ్యూన్ బూస్టింగ్ టానిక్‌గా మ‌న‌కు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

మీకు ఇంతకుముందే ఏవైనా జబ్బులు ఉన్నట్లయితే , వైద్యుల సలహా మేరకు మోతాదును పరిగణనలోకి తీసుకొని త్రాగండి.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...