మెంతులతో శిరోజాల ఆరోగ్యం ఎలాగంటే……………

September 26, 2016

ముఖం ఆకర్షణీయంగా తయారు కావడంలో తలపై వెంట్రుకలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.

వెంట్రుకలు సరిగ్గా లేకపోయేసరికి చాలా మందికి విసుగు కలుగుతుంది.
ఇందుకోసం అనేక బ్యూటీపార్లర్లను తిరుగుతూ….. వివిధ రకాల క్రీంలు వాడుతుంటారు.
మరీ ముఖ్యంగా వెంట్రుకలు రాలిపోయే సమస్యను చాలా మంది ఎదుర్కొంటుంటారు.

అయితే మెంతులను వాడడం వల్ల శిరోజాల సమస్య తీరే అవకాశం ఉంది.

aadhar-copy-copy-copy-2

మెంతులను మందారపూలతో కలిపి మెత్తని పొడిలా చేయాలి. దీనిని జుట్టుకు పట్టించాలి.
ఓ అరగంట అనంతరం తలస్నానం చేయాలి. దీనితో జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

వేడి కొబ్బ‌రినూనెలో మెంతుల‌ను వేసి రాత్రంతా నాన‌బెట్టాలి.
మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే ఆ మిశ్ర‌మాన్ని మెత్త‌ని పేస్టులా చేసుకోవాలి.
అనంతరం జుట్టు కుదుళ్లకు త‌గిలేలా ప‌ట్టించాలి. 20-30 నిమిషాల పాటు అలాగే ఉండి
త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో త‌ల‌స్నానం చేయాలి.

కోడిగ్రుడ్డు తెల్లసొనలో మెంతిపొడి కలిపి బాగా గిలకొట్టి తలకు రాసుకుని
అరగంట తరవాత తలంటుకుంటే చుండ్రు, దురదలు దరి చేరవు.

ఒక కప్పు మజ్జిగలో నాలుగు చెంచాల మెంతులు వేసి రాత్రంతా నాననివ్వాలి. ఆ మర్నాడు ఉదయాన్నే మెత్తగా రుబ్బి తలకు పట్టించాలి. ఇలా వారానికి మూడు సార్లు చేయాలి.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...