ముఖంపై మంగు మచ్చలు పోయేందుకు మార్గాలు

September 27, 2016

ముఖం రెండు వైపులా బుగ్గలపై నుండి ముక్కు వరకూ వ్యాపించే
నల్లని మచ్చలనే మంగు మచ్చలు అని అంటారు.

దీని వల్ల ముఖం అంద విహీనంగా మారుతుంది.
ఈ మంగు మచ్చలు మెడ, భుజాలు , వీపు భాగంలో కూడా ఏర్పడవచ్చు.

machhalu

ఈ మంగు మచ్చలు పోవాలంటే,

ఒక టీ స్పూన్ టమాటో రసం , ఒక టీ స్పూన్ గంధం పొడి కలిపి , రెండు టీ స్పూన్ల ముల్తానీ మట్టితో మెత్తని పేస్టులా చేసి మచ్చలపై పట్టించి ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి.ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయాలి.

రోజ్ వాటర్ ,కీరా దోస రసం, నిమ్మరసం, తేనె సమంగా తీసుకొని కలిపి మచ్చలపై రుద్ది ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుగుతుంటే కొద్దిరోజుల్లోనే చక్కని మార్పు వస్తుంది.

పాలల్లో ఎర్ర కందిపప్పు నూరి నెయ్యిలో కలిపి మంగు మచ్చలపై రాస్తూ ఉంటే కొన్ని రోజుల్లోనే నలుపుదనం పోతుంది.

కలబంద గుజ్జును తీసి మచ్చలపై పూసి, ఆ మచ్చలపై తడి ఆరిపోయాక చల్లని నీటితో కడగాలి.దీనివల్ల మచ్చలు తగ్గిపోతాయి.

ఒక పావు టీ స్పూన్ నిమ్మరసానికి సమంగా తేనెను కలిపి మచ్చలపై బాగా రుద్ది ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా నెల రోజుల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...