మన దేశం కోసం విదేశాలలో నేతాజీ ఎంతగా కష్టపడ్డారో ……. ఎంతటి ధైర్య సాహసాలతో పోరాడారో తెలుసుకోండి

September 25, 2016

స్వాతంత్రోద్యమ కాలంలో నేతాజీ మన దేశం వీడి అజ్ఞాతం లోకి వెళ్ళి ,
మనదేశం కోసం ఆయన చేసిన కృషి , త్యాగం తెలుసుకుంటే………..
ప్రతి ఒక్క భారతీయుడి గుండె దేశభక్తితో ఉప్పొంగిపోతుంది.

ఒక్కసారి దీనిని చదవండి……. ఆ మహనీయుడి ధైర్యం , సాహసం, త్యాగం తెలుస్తుంది.

నేతాజీకి వస్తున్న ప్రజాదరణను గ్రహించిన బ్రిటీష్ ప్రభుత్వం ఆయనను గృహ నిర్భందంలో ఉంచింది. ఇక అప్పట్లో తనను దేశం వదలి వెళ్ళనివ్వరని గ్రహించిన బోస్ 1941 జనవరి 19న, ఒక పఠాన్ లాగా వేషం వేసుకొని తన మేనల్లుడు శిశిర్ కుమార్ బోస్ తోడుగా ఇంటినుండి తప్పించుకొన్నాడు.

netaji

ముందుగా పెషావర్ చేరుకొన్నాడు. అక్కడ అతనికి అక్బర్ షా, మొహమ్మద్ షా, భగత్ రామ్ తల్వార్‌లతో పరిచయమైంది. 1941 జనవరి 26న, గెడ్డం పెంచుకొని, ఒక మూగ, చెవిటి వాడిలాగా నటిస్తూ, ఆఫ్ఘనిస్తాన్ వాయువ్య సరిహద్దు ప్రాంతం ద్వారా, మియాఁ అక్బర్ షా , అగాఖాన్‌ల సహకారంతో ఆఫ్ఘనిస్తాన్ లోంచి కాబూల్ ద్వారా ప్రయాణించి సోవియట్ యూనియన్ సరిహద్దు చేరుకున్నాడు.

రష్యాకు బ్రిటన్‌తో ఉన్న వైరం వల్ల తనకు ఆదరణ లభిస్తుందనుకొన్న బోస్‌కు నిరాశ ఎదురైంది. రష్యాలో ప్రవేశించగానే NKVDఅతనిని మాస్కోకు పంపింది. వారు అతనిని జర్మనీ రాయబారి షూలెన్‌బర్గ్ కి అప్పగించారు. అతను బోస్‌ను బెర్లిన్ పంపాడు.

తమ శత్రువుల కూటమి అయిన అగ్ర రాజ్యాల సహకారంతో బోస్ తప్పించుకొన్నాడని తెలియగానే అతనిని, జర్మనీ చేరకముందే, హత్య చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం తమ రహస్య ఏజెంట్లను నియమించింది. బ్రిటిష్ గూఢచారి దళానికి చెందిన Special Operations Executive (SOE) ఈ పనిని చేపట్టింది.[2]

ఇలా భారత దేశంనుండి ఆఫ్ఘనిస్తాన్,అక్కడినుండి రష్యా, అక్కడినుండి ఇటలీ మీదుగా జర్మనీ చేరుకొన్న బోస్ జర్మనుల సహకారంతో ఆజాద్ హింద్ రేడియో మొదలుపెట్టి ప్రసారాలు మొదలుపెట్టాడు. బెర్లిన్‌లో “స్వతంత్ర భారత కేంద్రం” (Free India Centre) స్థాపించాడు.

ఉత్తర ఆఫ్రికాలో బ్రిటిష్ సైన్యంలో భాగంగా ఉండి, అగ్రరాజ్యాలకు బందీలైన 4500 భారతీయ సైనికులతో ఇండియన్ లెజియన్ ప్రారంభించాడు. ఇండియన్ లెజియన్ ను వెన్నంటి నాజీ జర్మనీ సైన్యం సోవియట్ యూనియన్ మీదుగా భారత దేశంపై దండెత్తి బ్రిటిష్ వారిని పారద్రోలుతుందని బోస్ ఆకాంక్ష.

1943 లో ఒక జర్మన్ జలాంతర్గామి U-180లో గుడ్ హోప్ అగ్రం మీదుగా ఆగ్నేయ ఆసియాకు బయలుదేరాడు. జర్మన్ జలాంతర్గామి నుండి జపాన్ జలాంతర్గామి I-29 లోకి మారాడు. ఆ రెండు దేశాల జలాంతర్గాముల మధ్య ఒక సివిలియన్ వ్యక్తి మారడం ఈ ఒక్కసారే జరిగింది. తరువాత జపాన్ వారి సహకారంతో సింగపూర్ లో తన భారత జాతీయ సైన్యాన్ని బలపరచుకొన్నాడు.

భారత జాతీయ సైన్యాన్ని మోహన్ సింగ్ దేవ్ సెప్టెంబర్ 1942 తేదీన సింగపూర్ లో స్థాపించాడు. 1943లో సుభాష్ చంద్ర బోస్ రాకతో సైన్యం ఏర్పాటుకు కొత్త ఊపిరులూదినట్లైంది. అదే సంవత్సరంలో జూలై లో సింగపూర్ లో జరిగిన మీటింగ్ లో రాష్ బిహారీ బోస్ సుభాష్ చంద్రబోస్ కు సంస్థ పగ్గాలు అప్పగించాడు. బోస్ పిలుపుతో చాలా మంది దేశ భక్తులు సైన్యంలో చేరడమే కాకుండా దానికి ఆర్థిక సహాయం కూడా అందించారు.

జులై 4, 1944 లో బర్మా లో భారత జాతీయ సైన్యం పాల్గొన్న ర్యాలీ లో ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా ఉత్తేజ పూరితమైనవి. వీటిలో చాలా ప్రసిద్ధి గాంచినది.

“ మీ రక్తాన్ని ధారపోయండి.. మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను ”

ఈ ర్యాలీలో భారత ప్రజలను బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో తమతో పాటు చేరమని పిలుపునిచ్చాడు. హిందీలో సాగిన ఈ ప్రసంగం ఆద్యంతం ఉత్తేజ భరితంగా సాగింది.

ఈ సైన్యంలోని దళాలు ఆజాద్ హింద్ ప్రభుత్వాధీనంలో ఉండేవి. ఈ ప్రభుత్వం తానే స్వంతంగా కరెన్సీ, తపాలా బిళ్ళలు, న్యాయ మరియు పౌర నియమాలను రూపొందించింది. దీన్ని అగ్ర రాజ్యాలైన జర్మనీ, జపాన్,ఇటలీ, క్రొయేషియా,థాయ్‌లాండ్, బర్మా , ఫిలిప్ఫీన్స్ లాంటి దేశాలు కూడా ఆమోదించాయి. ఇటీవల జరిపిన పరిశోధనల మూలంగా రష్యా, సంయుక్త రాష్ట్రాలు కూడా దీన్ని ఆమోదించినట్లు తెలుస్తుంది.

అజ్ఞాతంలో ఉండి కూడా, మన దేశం కోసం అహర్నిశలు తపన పడిన మహానుభావుడు
నేతాజీ సుభాష్ చంద్రబోస్.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...