బిర్యానీ ఆకుతో షుగర్ ను దూరం చేయడమెలాగంటే………..

September 21, 2016

బిర్యానీ ఆకును ఈ విధంగా వాడితే షుగర్ వ్యాధిని నియంత్రించుకోవచ్చు.

ఇప్పుడు మన దేశంలో ఉన్న ప్రధాన వ్యాధులలో షుగర్ అతి ముఖ్యమైనది. వయసుతో సంబంధం లేకుండా షుగర్ ఎటాక్ చేస్తోంది. డయాబెటిస్ ను అదుపు చేసేందుకు అందరూ ఇంగ్లిష్ మందులనే ఆశ్రయిస్తున్నారు. అవి తక్షణ ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. అందుకే ఆ మందులను వాడుతూనే జీవన శైలిని మార్చుకోవాలి.

సహజ సిద్ధమైన ఆహారాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. దాంతో పాటుగా మీరు కింద చెప్పిన విధంగా బిర్యానీ ఆకును 2 సార్లు వాడితే కూడా షుగర్ నియంత్రణలోకి వస్తుంది. ప్రయోగాత్మకంగా దీనిని ఉపయోగించి మంచి ఫలితాలు వస్తాయని రుజువు చేశారు.

biryani-aku

తయారీ విధానం:-

ఒక గిన్నెలోకి 10 బిర్యానీ ఆకులు తీసుకోవాలి.

3 గ్లాసుల నీళ్లు పోసి 10నిముషాలు మరిగించాలి.

తర్వాత స్టవ్ నుంచి దించి 2, 3 గంటల పాటు మగ్గనివ్వాలి.

ఇక ఆకులను తొలగించి సగం గ్లాసు చొప్పున రోజుకు 3 సార్లు తాగాలి.

ఉదయం ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే చాలు ఆ రోజులో మూడు పూటలా తాగొచ్చు.

ఉదయం బ్రేక్ పాస్ట్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనానికి 1గంట ముందుగా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

ఇలా వరుసగా 3రోజులు క్రమం తప్పకుండా చేయాలి. 2వారాలు గ్యాప్ ఇచ్చి మళ్లీ 3రోజులు క్రమంగా వాడాలి.

ఇలా రెండు సార్లు చేస్తే చాలు షుగర్ నియంత్రణలోకి వస్తుంది.

ప్రయోజనాలు:

1.ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమ బద్దం చేయండం వల్ల డయాబెటిస్ కంట్రోల్ లోకి వస్తుంది.

2.అంతేకాకుండా కొలెస్ట్రాల్ తగ్గడం మూలాన గుండె జబ్బులు రావు.

3.క్యాన్సర్ కారకాలను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తిని శరీరానికి అందిస్తుంది.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...