పుదీనా + నిమ్మను కలిపి ఇలా చేస్తే ……. దోమలు , కీటకాలు ఇళ్ళకు దూరం

November 14, 2016

మ‌న ఇళ్ల‌లో దోమ‌లు, కీటకాలు లాంటివి ఉంటే వాటి వ‌ల్ల మ‌నం ఎన్ని ఇబ్బందుల‌కు గుర‌వుతామో
అంద‌రికీ తెలుసు. జాగ్ర‌త్త‌గా లేక‌పోతే వాటితో ఎన్నో ర‌కాల జబ్బులు కూడా వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.

ఈ క్ర‌మంలో వాటిని నిర్మూలించేందుకు ఒక్కో ర‌క‌మైన ప‌ద్ధ‌తిని మ‌నం అవలంబిస్తుంటాం. దోమ‌ల‌కైతే లిక్విడ్ , రేపెల్లెంట్ , బొద్దింక‌ల వంటి పురుగుల‌కైతే హిట్, రైడ్ లాంటి స్ప్రేల‌ను వాడతాం.

కానీ వాట‌న్నింటికీ బదులుగా కేవ‌లం ఒకే ఒక ద్రావణంతో అన్నింటినీ నిర్మూలించ‌వ‌చ్చు.
ఆ ద్రావణాన్ని మ‌నం ఇంట్లోనే సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు.

dpr

అది ఎలాగో ఒక్కసారి చదవండి .

పుదీనాలో ఎన్నో ర‌కాల ఔష‌ధ గుణాలు ఉన్నాయి. నిత్యం మ‌నం దీన్ని వంట‌కాల్లో ఉప‌యోగిస్తుంటాం. పుదీనా నుంచి వ‌చ్చే చ‌క్క‌ని వాస‌న మ‌న‌కైతే ఎంతో ఆహ్లాదాన్ని, ఉత్తేజాన్ని ఇస్తుంది.

కానీ అదే పుదీనాతో త‌యారు చేసిన మిశ్ర‌మం పైన చెప్పిన వాటి నుంచి మ‌న‌కు ఉప‌శ‌మ‌నాన్ని ఇస్తుంది.

నిమ్మ తొక్కలను తీసుకొని , వాటితోపాటు కొన్ని పుదీనా ఆకుల‌ను క‌లిపి
ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని దాంట్లో ముందు చెప్పిన ప‌దార్థాల‌ను వేయాలి.

అనంత‌రం ఆ నీటిని బాగా మ‌రిగించాలి. నీరు బాగా మ‌రిగాక స్టవ్ ఆర్పి ఆ ద్ర‌వాన్ని చ‌ల్లార‌నివ్వాలి.

అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని రాత్రంతా అలాగే వ‌దిలేయాలి.
ఉదయాన్నే ఆ మిశ్ర‌మాన్ని వ‌డ‌క‌ట్టి ద్ర‌వాన్ని సేక‌రించాలి.

ఆ ద్ర‌వంలో ర‌బ్బింగ్ ఆల్క‌హాల్ (దీన్ని స‌ర్జిక‌ల్ స్పిరిట్ అని కూడా పిలుస్తారు, మార్కెట్‌లో ఇది మ‌న‌కు ల‌భిస్తుంది)ను స‌మాన భాగంతో క‌ల‌పాలి.

త‌దుప‌రి వ‌చ్చే మిశ్ర‌మాన్ని స్ప్రే బాటిల్‌లో నిల్వ చేసుకుని కీట‌కాలు తిరిగే ప్రాంతంలో స్ర్పే చేయాలి.
అంతే, దీంతో ఇళ్ల‌లో ఇక‌పై దోమ‌లు, పురుగులు అస్స‌లు క‌నిపించ‌వు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...