నిరుద్యోగులకు తీపి కబురు – భారీగా ఉద్యోగాల నియామకం

November 9, 2016

నిరుద్యోగులకు తీపి కబురు – భారీగా ఉద్యోగాల ప్రకటన
****************************************
ఆంధ్రప్రదేశ్ లో ఉన్నత ఉద్యోగ నియామకాల కోసం ప్రకటన వెలువడింది.
APPSC విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా 982 పోస్టులను భర్తీ చేయనున్నారు.

తొలిసారిగా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ విధానంలో అభ్యర్థుల హాజరు తీసుకోనున్నారు.

edu

దరఖాస్తులను పూర్తి ఆన్ లైన్ విధానంలో స్వీకరిస్తారు.

25,000 మంది కంటే ఎక్కువ అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే
ప్రాథమిక పరీక్షను ఆఫ్ లైన్ పద్ధతిలో నిర్వహిస్తారు.

మెయిన్స్ పరీక్ష మాత్రం ఆన్ లైన్ విధానంలో నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీలు , వివరాలు
************************
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 11 . 11 . 2016

దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు : 10 . 12 . 2016

ప్రాథమిక పరీక్ష నిర్వహణ తేదీ : 26 . 02 . 2017

మెయిన్స్ పరీక్ష : 20 . 05 . 2017 & 21 . 05 . 2017

పూర్తి వివరాల కోసం www.psc.ap.gov.in వెబ్ సైట్ లో చూడండి

వయో పరిమితి సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ – 2 ( 20 – 42 సం. ల. మధ్య ) , ఎక్సైజ్ ఎస్సై ( 18 – 28 సం. ల. మధ్య ) పోస్టులకు మినహా మిగతా అన్ని పోస్టులకు 18 – 42 సం. ల. మధ్య వయసు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వీటికి దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు తమ పూర్తి వివరాలను వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్
( OTPR ) లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు :
************************
ఎగ్జిక్యూటివ్ పోస్టులు : 442

నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు : 540

మొత్తం పోస్టుల సంఖ్య : 982

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...