నడుము నొప్పితో బాధపడుతున్నారా……….. అయితే ఇలా చేయండి

October 6, 2016

ఇప్పుడున్న బిజీ లైఫ్ లో మనిషి జీవనం ప్రకృతి సహజ విధానాలకు విరుద్ధంగా ఉంటోంది.

పెరిగిపోతున్న పని ఒత్తిడి, పోషకాహారం సరిగా తీసుకోకపోవడం వల్ల
చాలామందికి చిన్న వయస్సులోనే నడుము నొప్పి వస్తోంది.

నడుము నొప్పి సమస్యతో సతమతమయ్యేవారు కొన్ని తేలికపాటి చిట్కాలు పాటించడం వల్ల
నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు అంటున్నారు.

back-pain

* ప్రతిరోజూ వెల్లుల్లి రసాన్ని పావు గ్లాసు గోరువెచ్చని పాలల్లో కలిపి తీసుకుంటే
నడుం నొప్పి నుండి విముక్తి కలుగుతుంది.

* అల్లం రసం, పసుపు కలిపిన పాలు తీసుకుంటే జీర్ణకోశం బాగుపడి, నడుంనొప్పి కూడా తగ్గుతుంది.

* ఆవనూనె, నువ్వుల నూనె కొద్దిగా వేడి చేసి నడుముకు మర్దన చేసుకుని
వేడినీళ్ళతో స్నానం చేస్తే నడుం నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

* గోరువెచ్చని నీళ్ళలో నిమ్మరసం కలిపి, పరగడుపున తాగితే కూడా నొప్పి తగ్గుతుంది.

* చిన్న ముక్కలుగా తరిగిన అల్లాన్ని రెండు కప్పుల నీళ్ళలో వేసి అవి ఒక కప్పు అయ్యే వరకు
మరిగించాలి. ఈ నీటిని వడగట్టి చల్లారిన తర్వాత దీనిలో తేనే కలుపుకొని తాగితే నడుము నొప్పి నుండి
ఉపశమనం కలుగుతుందని వైద్యులు అంటున్నారు.

* ఒక కప్పు పాలలో రోజు తేనె వేసుకొని తాగడం వల్ల కూడా నడుము నొప్పి రాకుండా ఉంటుంది.

* నడుము నొప్పిగా ఉన్న భాగంలో ప్రతి అరగంటకోసారి ఐస్‌తో కాపడం పెట్టుకోవడం ద్వారా నొప్పి తగ్గుతుంది.

* వంద గ్రాముల గసగసాలను పొడి చేసి పెట్టుకొని రెండు చెంచాల పొడిని గాల్లసు పాలలో కలుపుకొని రోజుకు రెండు సార్లు తాగడం వల్ల నొప్పి త్వరగా తగ్గుతుంది.

* అల్లం పెస్ట్‌ ను నొప్పి ఉన్న చోట కాసేపు పెట్టి కడిగేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. అల్లంలోని యాంటి ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నొప్పి తగ్గడానికి దోహదం చేస్తాయని వైద్యులు తెలిపారు.

Leave a Comment

Your feedback is valuable for us. Your email will not be published.

Please wait...